ఆంధ్రప్రదేశ్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల ప్రవేశాలకు నిర్వహించిన ఈఏపీసెట్-2023 పరీక్షలు మంగళవారంతో (మే 23) ముగిసిన సంగతి తెలిసిందే. వీటిల్లో ఇంజినీరింగ్ స్ట్రీమ్ పరీక్షల ప్రాథమిక ఆన్సర్ ‘కీ’ విడుదల చేశారు. అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షల కీ 24వ తేదీ ఉదయం 11 గంటల నుంచి అందుబాటులో ఉంటుందని ఈఏపీసెట్ ఛైర్మన్ రంగజనార్ధన, కన్వీనర్ శోభాబిందు తెలిపారు. ప్రాథమిక కీపై అభ్యంతరాలుంటే ఈనెల 26వ తేదీ ఉదయం 9 లోపు ఆన్‌లైన్ విధానం ద్వారా లేవనెత్తవచ్చని వెల్లడించారు. పరీక్షలకు హాజరైన అభ్యర్ధులు ఈఏపీసెట్ అధికారిక వెబ్‌సైట్‌లో ప్రాథమిక కీ డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపారు.
కాగా ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షలు మే 15 నుంచి 19 వరకు జరిగాయి. అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశ పరీక్షలు 22, 23 తేదీల్లో నిర్వహించారు. రోజుకు రెండు సెషన్ల చొప్పున నిర్వహించని ఈఏపీసెట్ పరీక్షలకు దాదాపు 93.38 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇంజినీరింగ్ విభాగంలో 2,24,724 మంది, ఫార్మసీ, అగ్రికల్చర్ విభాగాల్లో 90,573 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు.
మరిన్ని కెరీర్ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.