AP EAPCET 2022: ఆంధ్రప్రదేశ్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (AP EAPCET) 2022 ఈ ఏడాది మేలో నిర్వహించనున్నట్లు JNTU Kakinada నోటీసు జారీ చేసింది. ఏపీ ఈఏపీ 2022 పరీక్షను ఆన్‌లైన్ విధానంలో జరుగుతుంది. ఈ పరీక్షలో అభ్యర్ధులు ఉత్తీర్ణత సాధించాలంటే కనీసం 25 శాతం మార్కులు తప్పనిసరిగా సాధించాలి. ఇందులో ఉత్తీర్ణులైన వారు సంబంధిత కళాశాలల్లో అడ్మిషన్లు పొందేందుకు అర్హత సాధిస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పలు ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కళాశాలల్లో సీట్లను భర్తీ చేయడానికి ప్రతి సంవత్సరం ఈ పరీక్ష జరుగుతుంది. ఈ ఏడాది ఏపీ ఈఏసీ సెట్ 2022 లో మొత్తం 331 కళాశాలలు పాల్గొంటున్నాయి. ఈ పరీక్షను ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (APSCHE) ఆధీనంలో కాకినాడలోని జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ (JNTU) నిర్వహిస్తుంది. కాగా ఏపీ ఈఏసీ సెట్‌ను గతంలో EAMCET (ఇంజినీరింగ్ అగ్రికల్చర్ అండ్ మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్) అనే పేరుండేది. ఐతే రిజర్వేషన్ వర్గాలకు చెందిన విద్యార్థులకు కనీస మార్కుల విషయంలో సడలింపు ఉంది. ఈ పరీక్షలో సాధించిన మార్కులను 75 శాతం, ఇంటర్మీడియట్ గ్రూప్ సబ్జెక్ట్‌లో సాధించిన 25 శాతం మార్కుల ఆధారంగా ర్యాంకు కేటాయిస్తారు.
Also Read: