Deputy CM Pushpa Srivani: స్టెప్పులతో అదరగొట్టిన డిప్యూటీ సీఎం.. కోలాహలంగా ఆదివాసి సంబరం

|

Aug 09, 2021 | 1:04 PM

ఆదివాసీ దినోత్సవం వేడుకల్లో స్పెషల్ ఎట్రాక్షన్‌గా మారిపోయారు ఏపీ డిప్యూటీ సీఎం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పాముల పుష్ప శ్రీవాణి..

Deputy CM Pushpa Srivani: స్టెప్పులతో అదరగొట్టిన డిప్యూటీ సీఎం.. కోలాహలంగా ఆదివాసి సంబరం
Pushpa Sri Vani Dance
Follow us on

ఆదివాసీ దినోత్సవం వేడుకల్లో స్పెషల్ ఎట్రాక్షన్‌గా మారిపోయారు ఏపీ డిప్యూటీ సీఎం , గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పాముల పుష్ప శ్రీవాణి. వేడుకలో పాల్గొని ఆడిపాడారు. స్టెప్పులేసి విద్యార్థుల్ని సర్‌ప్రైజ్ చేశారు. విజయనగరం జిల్లా పార్వతీపురం ఐటీడీఏలో ఆదివాసీ దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ వేడుకలో పాల్గొన్నారు పుష్ప శ్రీవాణి. వేదికపై విద్యార్థులు గిరిజన సంప్రదాయ నృత్యాలతో అలరించారు. వేదికపైకి ఎక్కిన శ్రీవాణి వాళ్లందరిలో కలిసిపోయారు. పదం పదం కలిపి ఆడిపాడారు. ఏకంగా డిప్యూటీ సీఎం వచ్చి స్టెప్పులేయడంతో విద్యార్థులతో పాటు అక్కడున్న వాళ్లంతా ఫిదా అయ్యారు. ఆదివాసీ దినోత్స వేడుకల్లో గిరిజన సంక్షేమశాఖ మంత్రితో పాటు లోకల్ ఎమ్మెల్యే జోగారావు, అధికారులు, గిరిజనులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

 

 

అటు సంబరాలు.. ఇటు నిరసనలు

అటు సంబరాలు అలా ఉంటే… ఇటు అదే ఆదివాసీల నుంచి నిరసన కనిపిస్తోంది. ఉత్సవాల సంగతి తర్వాత.. ముందు మా కష్టాలు తీర్చండి అంటున్నారు. స్వాతంత్యం వచ్చి 75 ఏళ్లయినా కనీస సౌకర్యాలు ఏవీ అంటూ ప్రశ్నిస్తున్నారు. తలపై అడ్డాకులు పెట్టుకుని అర్థనగ్న ప్రదర్శనలు చేశారు.  విశాఖ జిల్లా రావికమతం మండలంలో ఈ సీన్‌ కనిపించింది. తాగునీటి కోసం కిలోమీటర్ల నడుస్తున్నాం, రోడ్లు లేవు, ఆరోగ్యం బాగో ఆస్పత్రులు వెళ్లాలన్నా డోలీలే దిక్కు. ఇంకా ఎన్నాళ్లీ బతుకు అన్నది వాళ్ల ఆవేదన. ఏజెన్సీ 11 మండలాలతో పాటు రావికమతం మండలంలోని జీలుగులోవ, నేరేడుబంద, ఎద్దగరువు, రోలుగుంట మండలం సింగి, పెద్దగరువు, పితృగడ్డ, కొరుప్రోలులోనూ ఎంతోమంది గిరిజనులు ఉన్నారు.

Also Read: దేశ వ్యాప్తంగా ఆజాదీ కీ అమృత్‌.. ప్రతి ఒక్కరు జాతీయ గీతాన్ని ఆలపించాలన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..

Funny Video: బాహుబలిని మించిన భారీ ఫైట్.. ఈ భీకర యుద్దానికి కారణం అదేనట..