Pawan Kalyan: లా అండ్ ఆర్డర్‌ విషయంలో ఇష్టారాజ్యంగా ఉంటే తొక్కి నార తీస్తాః డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

|

Jan 10, 2025 | 6:52 PM

ఆరు నెలలు అయింది.. హనీమూన్ ముగిసింది.. ఇప్పటికీ మేలుకోకపోతే మేటర్ సీరియస్సే.. అంటూ అధికారుల సీటు కింద హీటు పెంచేశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్. ఇప్పటిదాకా నేను ప్రశ్నించా..ఇకమీదట మీరు ప్రశ్నించండి అంటూ ప్రజానీకానికి బంపరాఫర్ ఇచ్చారు. విధినిర్వహణలో నిర్లక్ష్యం వహించే అధికారులకు స్వీట్ వార్నింగ్ ఇస్తూనే.. ఆ విధంగా ప్రజలకూ భరోసానిచ్చే ప్రయత్నం చేశారు డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్.

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో పర్యటించారు. పిఠాపురం మండలం కుమారపురం గ్రామంలో మినీ గోకులాన్ని పవన్ కల్యాణ్ ప్రారంభించారు. అనంతరం పిఠాపురంలోని సంక్రాంతి సంబరాల్లో ఆయన పాల్గొన్నారు. అయితే ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. విధినిర్వహణలో నిర్లక్ష్యం వహించే అధికారులకు స్వీట్ వార్నింగ్ ఇస్తూనే.. ఆ విధంగా ప్రజలకూ భరోసానిచ్చే ప్రయత్నం చేశారు డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్.

ఏపీలో కూటమి సర్కార్‌పై డిప్యూటీ సీఎం పవన్ కల్యాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. శక్తిపీఠం మీద ఆన పెట్టి చెప్తున్నా.. చాలా స్పష్టంగా ఉన్నా అని పవన్ అన్నారు. మరో15ఏళ్ల కంటే ఎక్కువ కాలం ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఉండాలని ఆయన ఆకాంక్షించారు. అధికారం అలంకారం కాదన్న పవన్.. బాధ్యత అని డిప్యూటీ సీఎం గుర్తు చేశారు. అలాగే లా అండ్ ఆర్డర్‌ విషయంలో ఇష్టారాజ్యంగా ఉంటే మాత్రం తొక్కి నార తీస్తా అని పవన్ కల్యాణ్ హెచ్చరించారు.

ఇదిలావుంటే, పిఠాపురం నుండే రాష్ట్రవ్యాప్తంగా ఉపాధి హామీ పథకం ద్వారా రైతుల సబ్సిడీలో నిర్మించిన 12,500 మినీ గోకులాలను పవన్ కల్యాణ్ ప్రారంభించారు. అనంతరం జరిగి సభలో పవన్ ప్రసంగించి ఈ వ్యాఖ్యలు చేశారు. పిఠాపురం నియోజకవర్గం అభివృద్ధి, విధివిధానాలను వివరించారు. పవన్ పర్యటన నేపథ్యంలో అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..