Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఏపీలోని ఉపాధి హామీ కూలీలకు గుడ్ న్యూస్.. వెల్లడించిన ఉప ముఖ్యమంత్రి

ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పవన్‌ కళ్యాణ్‌ కీలక ప్రకటన చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని ఉపాధి హామీ కూలీలకు శుభవార్త తెలిపారు. రాష్ట్రానికి కేంద్రం అదనంగా 6.50 కోట్ల పనిదినాలు కేటయించినట్లు పవన్‌ పవన్‌ తెలిపారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి..

Andhra Pradesh: ఏపీలోని ఉపాధి హామీ కూలీలకు గుడ్ న్యూస్.. వెల్లడించిన ఉప ముఖ్యమంత్రి
Pawan Kalyan
Follow us
Narender Vaitla

|

Updated on: Jul 31, 2024 | 12:10 PM

ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పవన్‌ కళ్యాణ్‌ కీలక ప్రకటన చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని ఉపాధి హామీ కూలీలకు శుభవార్త తెలిపారు. రాష్ట్రానికి కేంద్రం అదనంగా 6.50 కోట్ల పనిదినాలు కేటయించినట్లు పవన్‌ పవన్‌ తెలిపారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అదనంగా 6.50 కోట్ల పనిదినాలు కేటాయించింది.

ఇదిలా ఉంటే ఇప్పటికే కేటాయించిన 15 కోట్ల పనిదినాలు జూన్‌ నెలాఖరుకే పూర్తయ్యాయి. అయితే అదనపు అవసరాలను దృష్టిలో పెట్టుకొని కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ కార్యదర్శి ఆధ్వర్యంలో మంగళవారం దిల్లీలో నిర్వహించిన సమావేశంలో మరో 6.50 కోట్ల పనిదినాలకు ఆమోదం తెలిపినట్లు పవన్ కళ్యాణ్‌ తెలిపారు. దీంతో ఉపాధి హామీ కూలీలకు మరిన్ని ఎక్కువ రోజులు ఉపాధి లభించనుంది. పెరిగిన పని దినాల వల్ల ఉపాధి హామీ పథకంలో పని చేసే 54 లక్షల కుటుంబాలకు లబ్ది చేకూరనుంది.

ఇదిలా ఉంటే మొదట మంజూరు చేసిన 15 కోట్ల పని దినాలు జూన్‌ నెలాఖరుకే పూర్తికాగా, అదనపు పని దినాల కోసం ప్రతిపాదనలు పంపగా, ఢిల్లీలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఈ ప్రతిపాదనను అంగీకరించారని పవన్‌ చెప్పుకొచ్చారు. అదే విధంగా ఇప్పటి వరకు ఉపాధి హామీ కూలీలకు చెల్లించాల్సి బకాయిలను సత్వరమే విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించినట్లు కేంద్ర ప్రభుత్వం సమ్మతించినట్లు పవన్ తెలిపారు. ఇందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి, కేంద్ర ప్రభుత్వానికి పవన్‌ కృతజ్ఞతలు తెలిపారు.

కాగా.. అటవీశాఖ ఉద్యోగులపై దాడి చేస్తే కఠిన చర్యలు తప్పవని వపన్‌ హెచ్చరించారు. పల్నాడు జిల్లా విజయపురి సౌత్‌రేంజ్‌ అటవీ పరిధిలో వన్యప్రాణులను అక్రమ రవాణా చేసే ముఠాను అదుపులోకి తీసుకునే క్రమంలో అటవీశాఖ ఉద్యోగులపై జరిగిన దాడిని ఆయన ఖండించారు. ఈ విషయానికి సంబంధించి ఆ జిల్లా కలెక్టర్, ఎస్పీలతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..