AP Covid-19 Updates: ఏపీలో పెరుగుతున్న కరోనా కేసులు.. గత 24గంటల్లో 200లకు పైగా నమోదు..

|

Mar 12, 2021 | 7:10 PM

Andhra Pradesh Corona Updates: ఆంధ్రప్రదేశ్‌లో కరోనావైరస్ కేసుల ఉధృతి ఒక్కసారిగా పెరిగింది. రాష్ట్రంలో కరోనా మహమ్మారి కేసులు ఒక్కసారిగా..

AP Covid-19 Updates: ఏపీలో పెరుగుతున్న కరోనా కేసులు.. గత 24గంటల్లో 200లకు పైగా నమోదు..
Andhra Pradesh Corona Updates
Follow us on

Andhra Pradesh Corona Updates: ఆంధ్రప్రదేశ్‌లో కరోనావైరస్ కేసుల ఉధృతి ఒక్కసారిగా పెరిగింది. రాష్ట్రంలో కరోనా మహమ్మారి కేసులు ఒక్కసారిగా పెరిగాయి. తాజాగా ఏపీలో కరోనా కేసుల సంఖ్య 200మార్క్ దాటింది. నిన్న 174 కేసులే నమోదు కాగా.. తాజాగా 24 గంటల్లో 210 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా నిన్న కృష్ణా జిల్లాలో ఒకరు మరణించారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ శుక్రవారం సాయంత్రం హెల్త్‌ బులెటిన్‌ను విడుదల చేసింది. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. రాష్ట్రంలో కోవిడ్‌-19 కేసుల సంఖ్య 8,91,388 కి చేరగా.. మరణించిన వారి సంఖ్య 7180 కి పెరిగింది.

కాగా.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 140 మంది కరోనా కోలుకున్నారు. తాజాగా కోలుకున్న వారితో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకు 8,82,981 మంది వైరస్ నుంచి కోలుకున్నట్లు ఏపీ ప్రభుత్వం వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,227 కేసులు యాక్టివ్‌‌గా ఉన్నాయి. ఇదిలాఉంటే.. రాష్ట్రవ్యాప్తంగా గత 24 గంటల వ్యవధిలో 44,709 నమూనాలను పరీక్షించినట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. వీటితో కలిపి ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 1,44,48,650 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం వెల్లడించింది.

కాగా.. ఇటీవల కాలంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. కోవిడ్ మహమ్మారిని అరికట్టేందుకు ఇప్పటికే పలు చర్యలను ప్రారంభించింది. అయినప్పటికీ రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో అటు ప్రభుత్వంలో.. ఇటు ప్రజల్లో ఆందోళన మొదలైంది.

Also Read: