AP CM YS Jagan: గణపతి సచ్చిదానంద స్వామి ఆశీర్వాదం తీసుకున్నారు సీఎం జగన్. విజయవాడ పటమట దత్తానగర్‌లోని గణపతి సచ్చిదానందస్వామి ఆశ్రమానికి వెళ్లారు. మరకత రాజరాజేశ్వరి దేవి అమ్మ వారిని దర్శించుకున్నారు. పూజలు చేశారు. ఆ తర్వాత సచ్చిదానంద స్వామికి నూతన వస్త్రాలను, పండ్లు ఇచ్చారు. సచ్చిదానంద స్వామి సీఎం జగన్‌కు శాలువ కప్పి ఆశీర్వదించారు.
ఈ సందర్భంగా ఆశ్రమ నిర్వాహకులు ముఖ్యమంత్రి వైయస్ జగన్‌కు ఘనస్వాగతం పలికారు. ఆశ్రమంలోని శ్రీగణపతి దేవాలయాన్ని సందర్శించిన సీఎం జగన్.. వినాయకుడికి ప్రత్యేక పూజలు చేశారు. అదేవిధంగా శ్రీమరకత రాజరాజేశ్వరీ దేవిని దర్శించుకున్న సీఎం వైయస్ జగన్.. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి తీర్థప్రసాదాలు స్వీకరించారు.
అనంతరం అవధూత దత్తపీఠాధిపతి స్వామి సచ్చిదానందని కలిసి స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ వెంట టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్, కొడాలి నాని, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Read also: Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి సేవా కార్యక్రమాల్లో మరో ముందడుగు పడింది