Andhra Pradesh: విశాఖ పర్యటనలో సీఎం జగన్‌.. సౌత్‌లోనే అతిపెద్ద షాపింగ్‌ మాల్‌ ఏర్పాటుకు భూమి పూజ..

సుమారు 600 కోట్ల రూపాయల వ్యయంతో అంతర్జాతీయ ప్రమాణాలతో కైలాసపురం లో నిర్మించనున్న ఇనార్బిట్ మాల్ త్వరలో ప్రజలకు అందుబాటులోకి రానుంది. సౌత్‌ రాష్ట్రాల్లోనే ఇంతపెద్ద భారీ షాపింగ్ మాల్ మరెక్కడా లేదు. దీనికి సంబంధించి ప్రాథ‌మిక ఒప్పందాలు ఇప్ప‌టికే పూర్తయ్యాయి. తరువాత బీచ్‌ రోడ్డులోని ఏయూ కన్వెన్షన్‌ సెంటర్‌కు సీఎం జగన్‌ చేరుకుంటారు. ఆంధ్ర యూనివర్శిటీ విద్యార్ధులతో సీఎం ఇంటరాక్ట్‌ అవుతారు.

Andhra Pradesh: విశాఖ పర్యటనలో సీఎం జగన్‌.. సౌత్‌లోనే అతిపెద్ద షాపింగ్‌ మాల్‌ ఏర్పాటుకు భూమి పూజ..
CM Jagan

Edited By:

Updated on: Aug 01, 2023 | 12:39 PM

ఏపీ సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి ఇవాళ విశాఖపట్నంలో పర్యటించనున్నారు. నగరంలోని పలు అభివృద్ధి పనులకు శంకుస్ధాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. కైలాసపురం పోర్టు ఆసుపత్రి సమీపంలో ఇనార్బిట్‌ మాల్‌ నిర్మాణానికి భూమి పూజ చేస్తారు. GVMC చెందిన 50 అభివృద్ది పనులకు శంకుస్ధాపన అనంతరం సిరిపురంలోని ఏయూ క్యాంపస్‌కు చేరుకుంటారు. ఎలిమెంట్‌ ఫార్మా ఇంక్యుబేషన్‌ సెంటర్, బయో మానిటరింగ్‌ హబ్‌తో సహా ఐదు ప్రాజెక్టులకు సంబంధించిన భవనాలను ప్రారంభిస్తారు .

సుమారు 600 కోట్ల రూపాయల వ్యయంతో అంతర్జాతీయ ప్రమాణాలతో కైలాసపురం లో నిర్మించనున్న ఇనార్బిట్ మాల్ త్వరలో ప్రజలకు అందుబాటులోకి రానుంది. సౌత్‌ రాష్ట్రాల్లోనే ఇంతపెద్ద భారీ షాపింగ్ మాల్ మరెక్కడా లేదు. దీనికి సంబంధించి ప్రాథ‌మిక ఒప్పందాలు ఇప్ప‌టికే పూర్తయ్యాయి.

తరువాత బీచ్‌ రోడ్డులోని ఏయూ కన్వెన్షన్‌ సెంటర్‌కు సీఎం జగన్‌ చేరుకుంటారు. ఆంధ్ర యూనివర్శిటీ విద్యార్ధులతో సీఎం ఇంటరాక్ట్‌ అవుతారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us