Subway: సబ్‌వే ఫ్రాంచైజీ సూపర్‌ ఆఫర్‌..! మీకు జీవితాంతం ఫ్రీ శాండ్‌విచ్‌ విత్‌ కూల్‌డ్రింక్‌.. ఈ ఒక్కపని చేస్తే చాలు..

వెబ్‌సైట్ ప్రకారం, అధికారిక నిబంధనలకు అనుగుణంగా స్వీకరించబడిన అన్ని అర్హత గల ఎంట్రీలలో నుండి ఆగస్టు7, 2023న విజేతను ఎంపిక చేస్తారు. ఎంట్రీ ఫారమ్‌లో ఉన్న నిబంధనల మేరకు విజేతకు షరతులు వర్తింపజేస్తారు. దరఖాస్తుదారులు అధికారిక ఎంట్రీ ఫారమ్‌లో పూర్తి పేరు, ఇమెయిల్ చిరునామా, పుట్టిన తేదీని నమోదు చేయాలి. ఈ అద్భుతమైన ఆఫర్ గురించి తెలుసుకుందాం.

Subway: సబ్‌వే ఫ్రాంచైజీ సూపర్‌ ఆఫర్‌..! మీకు జీవితాంతం ఫ్రీ శాండ్‌విచ్‌ విత్‌ కూల్‌డ్రింక్‌.. ఈ ఒక్కపని చేస్తే చాలు..
Sandwiches And Drinks
Follow us
Jyothi Gadda

|

Updated on: Aug 01, 2023 | 8:00 AM

బర్గర్లు, కూల్‌డ్రింక్స్‌ అంటే ఇష్టపడే వారి కోసం ఓ ప్రత్యేకమైన ఆఫర్ వచ్చింది. మీరు శాండ్‌విచ్ తినాలనుకుంటే, అది కూడా జీవితాంతం ఫ్రీగా తినాలనుకుంటే, ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్ సబ్‌వే ఫ్రాంచైజీ గొప్ప ఆఫర్‌తో ముందుకు వచ్చింది. అమెరికా అతిపెద్ద శాండ్‌విచ్ చైన్‌ సబ్‌వే ఫ్రాంచైజీ ఆఫర్ కింద, కంపెనీ మీకు జీవితాంతం ఉచితంగా బర్గర్‌లు, శీతల పానీయాలను అందిస్తుంది. అందుకోసం సబ్‌వే ఒక షరతు విధించింది. మీరు దానికి అంగీకరించినట్టయితే..మీకు జీవితాంతం ఉచితంగా శాండ్‌విచ్‌లు, కూల్‌డ్రింక్స్‌ ఇవ్వబడతాయి. దీంతో మీరు లైఫ్‌లాంగ్‌.. బర్గర్లు, కూల్‌డ్రింక్స్‌ని ఫ్రీగా ఎంజాయ్‌ చెయొచ్చు. ఈ అద్భుతమైన ఆఫర్ గురించి తెలుసుకుందాం.

పేరు మార్పు పోటీకి ఒకరిని బస్ కంపెనీ ఎంపిక చేయాలి. ఆపై చట్టబద్ధంగా పోటీదారు వారి మొదటి పేరును సబ్‌వేగా మార్చుకోవాలి. ఆసక్తి ఉన్న ఎవరైనా ఆగస్టు1వ తేదీ ఉదయం 9 గంటల నుండి ఆగస్టు 4వ తేదీ రాత్రి 11:59 గంటల మధ్య తప్పనిసరిగా సబ్‌వేనేమ్‌ఛేంజ్.కామ్‌లో సైన్ అప్ చేయాలి. అయితే, యునైటెడ్ స్టేట్స్‌లోని చట్టపరమైన నివాసితులకు మాత్రమే ఈ పోటీ ఉంటుందని రెస్టారెంట్‌ స్పష్టం చేసింది. ఇక్కడ దరఖాస్తుదారుడి వయస్సు 18 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి. ఆసక్తికరంగా, పేరు మార్పు కోసం కంపెనీ విజేతకు $750 లీగల్ ఫీజును చెల్లిస్తుంది. విజేత $50,000 (రూ.41,13,000) విలువైన సబ్‌వే బహుమతి కార్డ్‌లను అందుకుంటారు. వీటిని జీవితకాలం పాటు సబ్‌వే నుండి బర్గర్‌లు, కూల్‌డ్రింక్స్‌ కొనుగోలు చెయొచ్చు.

ఎవరైనా తమ పేరును “సబ్‌వే”గా మార్చుకోవడానికి అంగీకరించే వారు కంపెనీకి పేరు మార్పు రుజువును చూపడానికి నాలుగు నెలల సమయం ఉంటుంది. దరఖాస్తుదారులు అధికారిక ఎంట్రీ ఫారమ్‌లో పూర్తి పేరు, ఇమెయిల్ చిరునామా, పుట్టిన తేదీని నమోదు చేయాలి. వారు ఎన్నికైనట్లయితే వారి మొదటి పేరు సబ్‌వేగా మార్చడానికి కట్టుబడి ఉంటారు! ఆపై ఫారమ్‌ను సమర్పించాలి.

ఇవి కూడా చదవండి

వెబ్‌సైట్ ప్రకారం, అధికారిక నిబంధనలకు అనుగుణంగా స్వీకరించబడిన అన్ని అర్హత గల ఎంట్రీలలో నుండి ఆగస్టు7, 2023న విజేతను ఎంపిక చేస్తారు. ఎంట్రీ ఫారమ్‌లో ఉన్న నిబంధనల మేరకు విజేతకు షరతులు వర్తింపజేస్తారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..