YS Jagan: ఏపీకి పెట్టుబడులు రాబట్టడమే టార్గెట్.. గ్లోబల్‌ సమ్మిట్‌‌‌కు సీఎం జగన్.. ఢిల్లీలో కీలక సమావేశం..

|

Jan 31, 2023 | 7:43 AM

ఏపీకి పెట్టుబడులు రాబట్టడం ఎలా? దీనిపైనే ఫోకస్ పెట్టారు ఏపీ సీఎం జగన్. మార్చిలో నిర్వహించే సమ్మిట్ కోసం ఇవాళ ఢిల్లీలో కర్టెన్‌రైజర్ మీటింగ్ ఏర్పాటు చేశారు.

YS Jagan: ఏపీకి పెట్టుబడులు రాబట్టడమే టార్గెట్.. గ్లోబల్‌ సమ్మిట్‌‌‌కు సీఎం జగన్.. ఢిల్లీలో కీలక సమావేశం..
AP Cm Ys Jagan Mohan Reddy
Follow us on

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఇవాళ ఢిల్లీలో జరిగే ఏపీ గ్లోబల్‌ ఇన్వెస్టర్ల సమ్మిట్‌ రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో భాగంగా కర్టెన్‌రైజర్‌ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఢిల్లీ లీలా ప్యాలెస్‌ హెటల్‌లో దౌత్యవేత్తలతో సీఎం జగన్‌ సమావేశమవుతారు. ఈ సమావేశానికి వివిధ దేశాల రాయబారులు, పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు. ఏపీలోకి పెట్టుబడులను ఆకర్షించేందుకు పారిశ్రామికవేత్తలు, వివిధ దేశాల అంబాసిడర్లతో సీఎం జగన్‌ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. మార్చి 3,4 తేదీల్లో విశాఖలో ఏపీ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ జరగనుంది. ఈ గ్లోబల్ సమ్మిట్‌లో, బిజినెస్-టు-బిజినెస్, బిజినెస్-టు-గవర్నమెంట్ సమావేశాలు, కీలక ప్రసంగాలు, సెక్టార్-నిర్దిష్ట దేశ-నిర్దిష్ట ప్లీనరీ సెషన్లను నిర్వహించనున్నారు.

కాగా, అంతర్జాతీయ పెట్టుబడుదారుల సదస్సు విజయవంతం చేసేందుకు దేశంలో ముఖ్య నగరాల్లో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లాలన్నది ప్లాన్. తొలుత న్యూఢిల్లీలో కర్టెన్ రైజర్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. ఈ ఈవెంట్‌కు 28 మంది విదేశీ పెట్టుబడిదారులు, 44 దేశాలకు చెందిన రాయబారులను ఆహ్వానించారు. ఏపీ అడ్వాంటేజ్ అనే థీమ్‌తో రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలను సీఎం జగన్‌ వివరిస్తారు.

రాష్ట్రంలో వ్యాపార అనుకూల వాతావరణం, బలమైన పారిశ్రామిక, లాజిస్టిక్స్ మౌలిక సదుపాయాలు, నైపుణ్యం కలిగిన మానవ వనరులు ఉన్నాయనే విషయాన్ని ఇన్వెస్టర్ల దృష్టికి తీసుకెళ్తారు. దీనికి తోడు ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలు, ప్రత్యేక రాయితీలును వివరించే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. వివిధ దేశాల రాయబారులతో ప్రత్యేకంగా రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తారు.

రాష్ట్రంలో ఆర్థిక అభివృద్ధి, పారిశ్రామిక అభివృద్ధి అవకాశాలను సీఎం జగన్‌ వివరిస్తారు. కర్టెన్ రైజర్‌ ఈవెంట్‌లతో పాటు ఫిబ్రవరిలో అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, కోల్‌కతా, ముంబై నగరాల్లో సైతం ఏపీ ప్రభుత్వం రోడ్డు షోలు నిర్వహించనుంది.

మరిన్ని ఏపీ వార్తల కోసం..