CM Jagan: ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. నేడు వారి ఖాతాల్లో జగనన్న విద్యా దీవెన నిధులు..

|

Mar 16, 2022 | 7:51 AM

Jagananna Vidya Deevena: జగనన్న విద్యాదీవెన పథకం కింద ఇవాళ విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లోకి రాష్ట్ర ప్రభుత్వం నగదు జమ చేయనుంది. ఈ పథకం కింద ప్రభుత్వం పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇస్తోంది.

CM Jagan: ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. నేడు వారి ఖాతాల్లో జగనన్న విద్యా దీవెన నిధులు..
Jagananna Vidya Deevena
Follow us on

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి(Ap cm YS Jagan Mohan Reddy) విద్యార్థులకు శుభవార్త చెప్పారు. జగనన్న విద్యాదీవెన పథకం కింద ఇవాళ విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లోకి రాష్ట్ర ప్రభుత్వం నగదు జమ చేయనుంది. ఈ పథకం కింద ప్రభుత్వం పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇస్తోంది. అక్టోబర్‌-డిసెంబర్ 2021 త్రైమాసికానికి దాదాపు 10.82 లక్షల మంది విద్యార్ధులకు రూ.709 కోట్లు అందించనుంది. సీఎం జగన్‌ బటన్‌ నొక్కి నేరుగా విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో ఈ మొత్తాన్ని ట్రాన్స్‌ఫర్ చేయనున్నారు. ఈ పథకం కింద ప్రభుత్వం పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్స్‌ ఇస్తోంది. క్రమం తప్పకుండా ఏ త్రైమాసికం ఫీజు ఆ త్రైమాసికం అయిన వెంటనే చెల్లిస్తోంది ఏపీ ప్రభుత్వం. పాఠశాల విద్య కోసం 2022- 23 ఆర్థిక సంవత్సరానికి రూ. 27,706.66 కోట్ల కేటాయింపులను ప్రతిపాదించింది. ఇది గత సంవత్సర కేటాయింపుల కంటే 12.52 శాతం ఎక్కువగా ఉంది.

ఏ తల్లికీ బిడ్డలను చదివించేందుకు పేదరికం అడ్డుకాకూడదనే ఆలోచనతో ఏపీ ప్రభుత్వం ‘జగనన్న అమ్మ ఒడి’ పథకాన్ని అమలు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 44,48,865 మంది తల్లు ఖాతాల్లో నేరుగా రూ. 15 వేల చొప్పున జమ చేస్తోంది. దీని వల్ల ఒకటవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న సుమారు 84 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి పొందుతున్నారు.

ఈ కిట్‌లలో 3 జతల యూనిఫాంలు, కుట్టు ఛార్జీలు, పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్‌ల సెట్, ఒక జత బూట్లు, 2 జతల సాక్స్, 1 స్కూల్ బ్యాగ్, 1 బెల్ట్, 3 మాస్కులు అందజేస్తున్నారు. వెనుకబడిన కుటుంబాల విద్యార్థులకు జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మొత్తం ఫీజు రీయింబర్స్‌మెంట్, నిర్వహణ రుసుం చెల్లిస్తోంది.

జగనన్న విద్యా దీవెన పథకం కింద.. దేశంలో ఎక్కడా లేని విధంగా అర్హులైన పేద విద్యార్థులందరికీ.. పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇస్తోంది ప్రభుత్వం. ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్‌, మెడిసిన్‌ తదితర కోర్సులు చదివే పేద విద్యార్థులు కాలేజీలకు చెల్లించాల్సిన పూర్తి ఫీజు మొత్తాన్ని క్రమం తప్పకుండా ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికం అయిన వెంటనే విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నేరు జమ చేస్తోంది సర్కార్‌.

ఇవి కూడా చదవండి: AP CM YS Jagan: రెండేళ్లలో పరీక్షా సమయం రాబోతోంది.. అంతా సిద్ధంగా ఉండాలిః సీఎం వైఎస్ జగన్

Holi 2022 bank holiday: కస్టమర్లకు అలెర్ట్.. వరుసగా నాలుగు రోజులు బ్యాంకులు బంద్.. ఎందుకంటే!