AP Oxygen Plants: ఏపీలో అందుబాటులోకి కృత్రిమ ప్రాణవాయువు.. ఆక్సిజన్ ఫ్లాంట్లను ప్రారంభించిన సీఎం జగన్

|

Jan 10, 2022 | 12:16 PM

ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం తాడేపల్లి నుంచి వర్చువల్‌గా రాష్ట్రంలోని 144 ఆక్సిజన్‌ ప్లాంట్లను ప్రారంభించారు.

AP Oxygen Plants: ఏపీలో అందుబాటులోకి కృత్రిమ ప్రాణవాయువు.. ఆక్సిజన్ ఫ్లాంట్లను ప్రారంభించిన సీఎం జగన్
Jagan
Follow us on

AP CM Jagana launches Oxygen plants: దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి మరోసారి కల్లోలం సృష్టిస్తోంది. రెండో వేవ్‌లో రాకాసి వైరస్ కారణంగా ఆక్సిజన్‌ కొరతను దృష్టిలో ఉంచుకున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందస్తు చర్యలు ప్రారంభించారు. అయితే, తాజాగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈసారి మెడికల్‌ ఆక్సిజన్‌ విషయంలో స్వావలంబన సాధించే దిశగా పలు కీలక చర్యలు తీసుకున్నారు. యాభై పడకలు దాటిన ప్రభుత్వాసుపత్రుల్లో సొంతంగా మెడికల్‌ ఆక్సిజన్‌ తయారీ యూనిట్లను నెలకొల్పడంపై ప్రత్యేక దృష్టిపెట్టారు. ఫలితంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని వివిధ ఆస్పత్రుల్లో 133 పీఎస్‌ఏ మెడికల్‌ ఆక్సిజన్‌ తయారీ ప్లాంట్లు అందుబాటులోకి వచ్చాయి. వీటిని ముఖ్యమంత్రి ఇవాళ వర్చువల్‌ పద్ధతిలో ప్రారంభించారు.

ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం తాడేపల్లి నుంచి వర్చువల్‌గా రాష్ట్రంలోని 144 ఆక్సిజన్‌ ప్లాంట్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. 144 ఆక్సిజన్‌ ప్లాంట్లను జాతికి అంకితం చేస్తున్నామని​ తెలిపారు. మనమే సొంతంగా ఆక్సిజన్‌ సరఫలా చేసేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఒమైక్రాన్‌ ప్రభావంతో కేసులు వేగంగా విస్తరిస్తోందని వైద్య నిపుణులు వెల్లడిస్తున్న నేపథ్యంలో ఈ ప్లాంట్లు కోవిడ్‌ మహమ్మారిన బారినపడ్డ వారికి చికిత్స అందించడంలో కీలక పాత్ర పోషించనున్నాయన్నారు.

రూ.426 కోట్ల వ్యయంతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌ ప్లాంట్లను ఏర్పాటు చేశారు. ఇందుకుగాను రూ.20 కోట్ల వ్యయంతో ఆక్సిజన్‌ క్రయోజనిక్‌ కంటైనర్లను కొనుగోలు చేశారు. దీనిద్వారా రాష్ట్రవ్యాప్తంగా 24,419 బెడ్లకు ఆక్సిజన్‌ పైప్‌లైన్లు సౌకర్యం కల్పించనున్నారు. మొత్తం 39 లిక్విడ్‌ మెడికల్‌ ఆక్సిజన్‌ ట్యాంకులు ఏర్పాటు చేశారు. కోవిడ్‌తో పాటు ఇతర చికిత్సలకు 20 అత్యాధునిక ఆర్టీపీసీఆర్‌ వైరల్‌ ల్యాబ్‌లు అందుబాటులోకి రానున్నాయి.