YSRCP Manifesto: మెరుగైన మేనిఫెస్టోపై సీరియస్ డిస్కస్‌.. అన్ని వర్గాలను ఆకట్టుకోవడమే లక్ష్యం

|

Mar 01, 2024 | 7:53 AM

ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ పొలిటికల్ హీట్ పెరిగిపోతోంది. ఓ వైపు అభ్యర్థులపై క్లారిటీ.. మరోవైపు సిద్ధం సభలు.. ఇంకోవైపు మేనిఫెస్టోపై ఫోకస్ పెట్టాయి అన్ని పార్టీలు. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి విజయకేతన ఎగురవేయాలని కంకణం కట్టుకున్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ.. ఆ దిశగా వ్యూహాలు రచిస్తోంది. 2019 ఎన్నికల్లో విజయం సాధించి పెట్టిన మేనిఫెస్టోకి మరిన్ని హంగులు చేర్చాలని డిసైడ్ అయింది. ఇందులో భాగంగా సీఎం క్యాంప్ కార్యాలయంలో మేనిఫెస్టోపై సమీక్షించారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.

YSRCP Manifesto: మెరుగైన మేనిఫెస్టోపై సీరియస్ డిస్కస్‌.. అన్ని వర్గాలను ఆకట్టుకోవడమే లక్ష్యం
Ys Jagan Mohan Reddy
Follow us on

ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ పొలిటికల్ హీట్ పెరిగిపోతోంది. ఓ వైపు అభ్యర్థులపై క్లారిటీ.. మరోవైపు సిద్ధం సభలు.. ఇంకోవైపు మేనిఫెస్టోపై ఫోకస్ పెట్టాయి అన్ని పార్టీలు. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి విజయకేతన ఎగురవేయాలని కంకణం కట్టుకున్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ.. ఆ దిశగా వ్యూహాలు రచిస్తోంది. 2019 ఎన్నికల్లో విజయం సాధించి పెట్టిన మేనిఫెస్టోకి మరిన్ని హంగులు చేర్చాలని డిసైడ్ అయింది. ఇందులో భాగంగా సీఎం క్యాంప్ కార్యాలయంలో మేనిఫెస్టోపై సమీక్షించారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వైసీపీ ముఖ్యనేతలతో సమావేశమైన జగన్‌.. ప్రస్తుతం అమలవుతున్న పలు పథకాలు, వచ్చే ఎన్నికల్లో ప్రకటించాల్సిన మేనిఫెస్టోపై చర్చించారు.

గత సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రలో తాను స్వయంగా చూసిన.. ఎదురైన అనుభవాలతో మేనిఫెస్టో సిద్ధం చేసి విడుదల చేశారు. ఇచ్చిన హామీలతో పాటు అదనంగా మరికొన్ని యాడ్ చేశారు. ఇప్పుడు ఎన్నికల వేళ మరింత మెరుగైన మేనిఫెస్టోతో వెళ్లాలనే దానిపై చాలా సిరియస్‌గా డిస్కస్ చేస్తున్నారు.
మరోవైపు టీడీపీ-జనసేన ఉమ్మడి మేనిఫెస్టోపై దృష్టి సారించాయి. టీడీపీ అయితే ఇప్పటికే సూపర్ సిక్స్‌తో ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఈ రెండు పార్టీలకు ధీటుగా మేనిఫెస్టోను రూపొందించాలని భావిస్తున్నారు సీఎం వైఎస్ జగన్‌.

మేనిఫెస్టోలో యువత, రైతులకు పెద్దపీట వేస్తూ వారికి లబ్ది చేకూరేలా కసరత్తు చేస్తున్నారు సీఎం జగన్. ప్రధానంగా వైసీపీకి కలిసొచ్చిన పెన్షన్ పెంపు, అమ్మ ఒడి లాంటి అంశాలను కొనసాగిస్తూనే.. మరింత పెంపుపై ఆలోచన చేస్తున్నారు. గత 5 ఏళ్ల కాలంలో ప్రతి ఏడాది విడతల వారీగా పెంచుకుంటూ వచ్చారు. ప్రస్తుతం ఇస్తున్న పెన్షన్ మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేలకు పెంచాలని భావిస్తున్నారు.

సిద్ధం సభలు ముగిశాక పూర్తిస్థాయిలో మేనిఫెస్టో పై కసరత్తు చేయబోతున్నారు సీఎం జగన్. రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన విజ్ఞప్తుల ఆధారంగా.. మేనిఫెస్టోలో కొత్త అంశాలను చేర్చబోతున్నారు. వైసీపీ మేనిఫెస్టో కమిటీ కోసం పార్టీలోని పలువురు సీనియర్లు ఇప్పటికే కసరత్తు చేపట్టారు. సీనియర్ ఐఏఎస్‌లు, మాజీ మంత్రుల నివేదికల ఆధారంగా అన్ని వర్గాలను దగ్గర చేసుకోవడమే లక్ష్యంగా మేనిఫెస్టో ఉండనుంది. త్వరలో చేపట్టే జిల్లాల పర్యటనలో పూర్తిస్థాయి మేనిఫెస్టో విడుదల చేసే అవకాశాలున్నాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…