YS Jagan: గవర్నర్‌ బిశ్వభూషణ్‌తో సీఎం వైఎస్ జగన్ భేటీ.. బడ్జెట్ సమావేశాలపై చర్చ

|

Mar 01, 2022 | 7:56 AM

YS Jagan Meets Governor Biswabhusan: ఏపీ సీఎం వైఎస్ జగన్ గవర్నర్‌తో భేటీ అయ్యారు . త్వరలో అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో వీరి భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది.

YS Jagan: గవర్నర్‌ బిశ్వభూషణ్‌తో సీఎం వైఎస్ జగన్ భేటీ.. బడ్జెట్ సమావేశాలపై చర్చ
Ys Jagan
Follow us on

YS Jagan Meets Governor Biswabhusan: ఏపీ సీఎం వైఎస్ జగన్ గవర్నర్‌తో భేటీ అయ్యారు . త్వరలో అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో వీరి భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. సోమవారం గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ దంపతులను ముఖ్యమంత్రి జగన్‌, ఆయన సతీమణి భారతి రాజ్‌భవన్‌లో మర్యాద పూర్వకంగా కలిశారు. దాదాపు అరగంట పాటు సమకాలీన రాజకీయ అంశాలపై చర్చించారు గవర్నర్‌, సీఎం. త్వరలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్న విషయాన్ని గవర్నర్ (Biswabhusan Harichandan) దృష్టికి తీసుకువచ్చి అనుమతి తీసుకున్నారు ముఖ్యమంత్రి జగన్. ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించాలని గవర్నర్‌ను ఆహ్వానించారు సీఎం. ప్రభుత్వం జిల్లాల పునర్ విభజన చేపట్టనుండగా ఆవిషయాన్ని గవర్నర్‌ బిశ్వ భూషణ్‌కు వివరించారు ముఖ్యమంత్రి.

పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా జిల్లాల పునర్ విభజన జరుగుతుందని, ప్రజల నుంచి వినతులను స్వీకరించి ఆమోద యోగ్యమైన రీతిలో నూతన జిల్లాలను ఏర్పాటు చేస్తామని వివరించారు సీఎం జగన్. ఏపీలో ఈనెల 7నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. 7న ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్‌. 8న గౌతమ్‌రెడ్డి మృతిపై సభ సంతాపం తెలపనుంది. 11న బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. బడ్జెట్‌ రూపకల్పనపై ఆర్థిక శాఖ ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. ప్రస్తుత బడ్జెట్‌లో విద్య, వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. వ్యవసాయం, పాడి పరిశ్రమపై ప్రభుత్వం దృష్టి పెడుతోంది.

ఇదిలాఉంటే, 2019తో పోల్చుకుంటే రాబడులు భారీగా పెరిగాయి. గత బడ్జెట్‌లో వివిధ రంగాలకు చేసిన కేటాయింపులు, ప్రస్తుతం బడ్జెట్‌లో చేసే కేటాయింపులపై సర్కార్ ప్రత్యేక దృష్టిసారించింది. ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను రెండు వారాలకు పైగా నిర్వహించాలని యోచిస్తోంది జగన్ ప్రభుత్వం.

Also Read:

Shivaratri 2022: తెలుగు రాష్ట్రాల్లో శివ నామస్మరణతో మార్మోగుతున్న శైవక్షేత్రాలు.. శివాలయాల్లో బారులు తీరిన భక్తులు

కుమార్తె గొంతు నులిమి చంపిన తల్లి.. ప్రియుడితో కలిసి దారుణం.. అసలేం జరిగిందంటే..