నియోజకవర్గాల వారీగా గ్రౌండ్ రిపోర్ట్ ఏంటీ..? భవిష్యత్ కార్యచరణ ఎలా ఉండబోతోంది.. ఏపీ ఎన్నికలపై ఏమైనా ప్రకటన ఉంటుందా..? ఇప్పుడు అధికార పార్టీ వైసీపీలో ఇదే హాట్ టాపిక్.. వైఎస్ఆర్‌సీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఇవాళ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గాల కోఆర్డినేటర్లు, పార్టీ జిల్లా అధ్యక్షులతో సమావేశం కానున్నారు. భవిష్యత్ కార్యచరణపై తాడేపల్లిలోని క్యాంపాఫీసులో సీఎం జగన్ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంపై సమీక్ష జరపాలన్నది ఎజెండా. అయితే.. సీఎం జగన్ భవిష్యత్తు రాజకీయ కార్యాచరణపై దిశానిర్దేశం చేస్తారని తెలుస్తోంది. కానీ.. మీటింగ్‌లో అంతకుమించి ఏదో ఉండబోతోందని కూడా నేతలు చెబుతున్నారు. గత నెల 18న కూడా ఇటువంటి మీటింగ్ జరిగింది. సంస్థాగత పదవుల పైనే ఆ భేటీలో ఫోకస్ పెట్టారు. 100కు పైగా కార్పొరేషన్లకు కొత్త చైర్మన్లను ప్రకటించారు. టీటీడీ బోర్డు మెంబర్ల జాబితా కూడా అక్కడే ఖరారైంది. అంతకుమించి రాజకీయపరమైన చర్చ లోతుగా జరగలేదు. కానీ.. ఈ నెలరోజుల గ్యాప్‌లో ఏపీలో పొలిటికల్‌గా చాలా మార్పులొచ్చేశాయి. గతంతో పోలిస్తే ఈ సమావేశం చాలా కీలకమని.. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో భేటీకి ప్రాధాన్యత నెలకొందని వైసీపీ లీడర్స్ పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో జగన్ గట్టి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందంటున్నారు. అంతేకాకుండా హిట్‌లిస్టులో ఉన్న 18 మంది ఎమ్మెల్యేల గ్రాఫ్‌పై కూడా చర్చ జరుగుతుందని.. సమాచారం.. ఈ నేపథ్యంలో ఇవాళ జరిగే సమావేశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్, అదే సమయంలో టీడీపీతో పొత్తును ప్రకటించిన జనసేన.. వైసీపీపై ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి చేసిన తీవ్ర ఆరోపణలు… ఇటువంటి కీలక పరిణామాల నేపథ్యంలో జగన్ భేటీపై సహజంగానే ఫోకస్ పెరిగింది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణం కనుక.. పొలిటికల్ ఈక్వేషన్లపై పార్టీ నేతల దగ్గర ప్రస్తావించే అవకాశముంది.
ఐప్యాక్ సర్వే అప్‌డేట్స్ నేపథ్యం కూడా భేటీని వేడెక్కించే ఛాన్సుంది. ఇప్పటికే 18 మందిని హిట్‌లిస్టులో పెట్టినట్టు జూన్‌లో జరిగిన సమావేశంలో జగన్ చెప్పేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యేల గ్రాఫ్ ఎలా ఉంది.. గతంలో వార్నింగ్ ఇచ్చినవాళ్లలో ప్రోగ్రెస్ కనిపించిందా లేదా అనే అంశంపై జగన్ రియాక్టవుతారని తెలుస్తోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..