YS Jagan: సీఎం జగన్ బెయిల్ రద్దు కేసు విచారణ వాయిదా.. ఇదే చివరి అవకాశమన్న సీబీఐ కోర్టు

|

May 26, 2021 | 12:25 PM

AP CM YS Jagan CBI bail case: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి బెయిల్ రద్దు కేసు విచారణ మరోసారి వాయిదా పడింది. ఈ మేరకు ధర్మాసనం ఈ కేసు విచారణను

YS Jagan: సీఎం జగన్ బెయిల్ రద్దు కేసు విచారణ వాయిదా.. ఇదే చివరి అవకాశమన్న సీబీఐ కోర్టు
Cm Ys Jagan
Follow us on

AP CM YS Jagan CBI bail case: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి బెయిల్ రద్దు కేసు విచారణ మరోసారి వాయిదా పడింది. ఈ మేరకు ధర్మాసనం ఈ కేసు విచారణను జూన్ 1 కి వాయిదా వేసింది. అయితే.. కౌంటర్ దాఖలుకు జగన్, సీబీఐ అధికారులు మరింత గడువు కోరడంతో చివరి అవకాశం ఇస్తూ సీబీఐ కోర్టు విచారణను మరోసారి వేస్తూ నిర్ణయం తీసుకుంది. జగన్ బెయిల్ రద్దు చేయలంటూ ఎంపీ రఘు రామ కృష్ణం రాజు దాఖలు చేసిన పిటిషన్‌పై బుధవారం ఉదయం విచారణ జరిగింది. లాక్‌డౌన్ తదితరుల కారణాల వల్ల కౌంటర్ దాఖలు చేయలేదని జగన్ తరపు న్యాయవాదులు తెలిపారు. దీంతోపాటు సీబీఐ నుంచి ఇంకా సూచనలు రాలేదని సీబీఐ న్యాయవాదులు ధర్మాసనానికి తెలియజేశారు.

దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన రఘురామ తరపు న్యాయవాది.. ప్రతివాదులకు జరిమానా విధించాలని కోరారు. అయితే కౌంటర్ దాఖలు చేసేందుకు చివరి అవకాశం ఇస్తున్నామని.. జూన్ 1న కౌంటర్ దాఖలు చేయకపోతే నేరుగా విచారణ చేపడతామని సీబీఐ న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ మేరకు జూన్ 1 వ తేదీ వరకు ఈ కేసు విచారణను ధర్మాసనం వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది.

Also Read:

Cyclone Yaas: అల్లకల్లోలం సృష్టిస్తున్న యాస్ తుఫాన్.. నివాస ప్రాంతాల్లోకి సముద్రం నీరు.. వీడియో..

WTC Final: ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లనున్న ఈ టీమిండియా ప్లేయర్స్ సతీమణులు కూడా ఆటగాళ్ళే.. వాళ్లెవరో తెలుసా.?