AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కేంద్ర జ‌ల‌శ‌క్తి మంత్రి గ‌జేంద్ర‌సింగ్‌తో ముగిసిన ఏపీ సీఎం జ‌గ‌న్ భేటీ.. ప‌లు కీల‌క అంశాల‌పై చ‌ర్చ

ఢిల్లీ: ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్‌. జ‌గ‌న్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న కొన‌సాగుతోంది. ఈ సంద‌ర్భంగా కేంద్ర జ‌ల‌శ‌క్తి మంత్రి గ‌జేంద్ర‌సింగ్‌తో జ‌గ‌న్ భేటీ అయ్యారు. అర‌గంట పాటు కొన‌సాగిన ఈ భేటీలు ప‌లు కీల‌క....

కేంద్ర జ‌ల‌శ‌క్తి మంత్రి గ‌జేంద్ర‌సింగ్‌తో ముగిసిన ఏపీ సీఎం జ‌గ‌న్ భేటీ.. ప‌లు కీల‌క అంశాల‌పై చ‌ర్చ
Anil kumar poka
|

Updated on: Dec 16, 2020 | 10:20 AM

Share

ఢిల్లీ: ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్‌. జ‌గ‌న్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న కొన‌సాగుతోంది. ఈ సంద‌ర్భంగా కేంద్ర జ‌ల‌శ‌క్తి మంత్రి గ‌జేంద్ర‌సింగ్‌తో జ‌గ‌న్ భేటీ అయ్యారు. అర‌గంట పాటు కొన‌సాగిన ఈ భేటీలు ప‌లు కీల‌క అంశాల‌పై చ‌ర్చించారు జ‌గ‌న్‌. పోల‌వ‌రం ప్రాజెక్టు స‌వ‌రించిన అంచనాల‌ను ఆమోదించాల‌ని విన్న‌వించగా, మంత్రి సానుకూలంగా స్పందించిన‌ట్లు తెలుస్తోంది.

పోల‌వ‌రం ప్రాజెక్టు స‌వ‌రించిన వ్య‌యం రూ.55,656 కోట్ల ఖ‌ర్చును ఆమోదించాలని జ‌గ‌న్ విజ్ఞ‌ప్తి చేశారు. భూసేక‌ర‌ణ‌, పున‌రావాస ప‌నులకు అయ్యే ఖ‌ర్చును రీయింబ‌ర్స్ చేయాలని ముఖ్య‌మంత్రి కోరారు. 2005-06తో పోలిస్తే 2017-18 నాటికి త‌ర‌లించాల్సిన కుటుంబాల సంఖ్య గ‌ణ‌నీయంగా పెరిగింద‌ని, 44,574 కుటుంబాల నుంచి 1,06,006కు పెరిగిందని తెలిపారు. అలాగే ముంపున‌కు గుర‌వుతున్న ఇళ్ల సంఖ్య కూడా గ‌ణ‌నీయంగా పెరిగింద‌ని వివ‌రించారు. దీని వ‌ల్ల ఆర్ అండ్ ఆర్ కోసం పెట్టాల్సిన ఖ‌ర్చు గ‌ణ‌నీయంగా పెరిగింద‌న్నారు.

పోల‌వ‌రం ప్రాజెక్టు నిర్మాణం కోసం రాష్ట్ర ప్ర‌భుత్వం చేసిన ఖ‌ర్చులో ఇంకా రూ.1779 కోట్లు రీయింబ‌ర్స్‌మెంట్ చేయాల్సి ఉంద‌ని, 2018 డిసెంబ‌ర్‌కు సంబంధించిన ఈ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయ‌న్నారు. ప్రాజెక్టు నిర్మాణంలో ఏ మాత్రం ఆల‌స్యం జ‌రిగినా ఖ‌ర్చు ఇంకా పెరిగే అవ‌కాశం ఉంద‌ని, ఏపీకి ప్రాణాధార‌ణ‌మైన ప్రాజెక్టు కు సంబంధించిన నిధులు వీలైనంత త్వ‌ర‌గా అందించాల‌ని మంత్రికి విజ్ఞ‌ప్తి చేశారు. జాతీయ ప్రాజెక్టు పోల‌వ‌రాన్ని స‌త్వ‌రం పూర్తి చేయ‌డానికి త‌గిన విధంగా స‌హాయం అందించాల‌ని సీఎం జ‌గ‌న్ కోరారు.

ఢిల్లీ పర్యటనలో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి.. హోంమంత్రి అమిత్‌షాతో పలు విషయాలపై మంతనాలు..

Follow Us
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
ఈ రాశులకు కుజ-చంద్రుల అనుగ్రహం.. డబ్బుకు లోటే ఉండదు!
ఈ రాశులకు కుజ-చంద్రుల అనుగ్రహం.. డబ్బుకు లోటే ఉండదు!