CM Jagan: ఏపీ ఉద్యోగులకు ఫిట్‌మెంట్‌ ప్రకటించిన జగన్ సర్కార్.. మరో గుడ్ న్యూస్

|

Jan 07, 2022 | 5:30 PM

ఏపీ ఉద్యోగులకు జగన్ సర్కార్ ఫిట్‌మెంట్‌పై క్లారిటీ ఇచ్చింది. దీనితో పాటు మరో గుడ్ న్యూస్ కూడా చెప్పింది.

CM Jagan: ఏపీ ఉద్యోగులకు ఫిట్‌మెంట్‌ ప్రకటించిన జగన్ సర్కార్.. మరో గుడ్ న్యూస్
Cm Jagan
Follow us on

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రకటన వచ్చేసింది. ఏపీ ఉద్యోగులకు జగన్ సర్కార్ ఫిట్‌మెంట్‌పై క్లారిటీ ఇచ్చింది. 23 శాతం ఫిట్‌మెంట్ ఇస్తున్నట్లు తెలిపింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ప్రభుత్వ వనరులపై ఇప్పటికే ఉద్యోగ సంఘాల నాయకులకు క్లియర్‌ కట్‌గా చెప్పిన ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి.. మరోసారి ఉద్యోగ సంఘాల నాయకులతో భేటీ అయ్యి.. ఫిట్‌మెంట్‌పై ప్రకటన చేశారు. జనవరి 1, 2022 నుంచి పెంచిన కొత్త జీతాలు అమలవ్వనున్నాయి. ఈ నిర్ణయం ద్వారా ప్రభుత్వంపై 10,247 కోట్ల అదనపు భారం పడనుంది. పీఆర్సీ జూలై 1, 2018 నుంచి అమలు కానుంది. మానిటరీ బెనిఫిట్‌ ఏప్రిల్‌ 1, 2020 నుంచి అమలు కానుంది. దీనితో పాటు మరో గుడ్ న్యూస్ కూడా చెప్పింది. ఉద్యోగుల రిటైర్‌మెంట్ వయస్సు 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ నెల నుంచి విరమణ వయసు పెంపు అమలవ్వనుంది. జూన్ 30లోపు కారుణ్య నియామకాలు పూర్తి చేస్తామని వెల్లడించింది. హెల్త్‌ స్కీమ్‌ అమలులో సమస్యలకు 2 వారాల్లో పరిష్కారం చూపుతామని సర్కార్  హామి ఇచ్చింది.

గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న ఎంప్లాయిస్ అందరికీ జూన్‌ 30లోగా ప్రొబేషన్, కన్ఫర్మేషన్‌ ప్రక్రియను కంప్లీట్ చేసి, సవరించిన విధంగా రెగ్యులర్‌ జీతాలను (న్యూ పేస్కేలు) ఈ ఏడాది జూలై జీతం నుంచి ఇవ్వనున్నారు. సొంతిల్లు లేని గవర్నమెంట్ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వమే అభివృద్ధి చేస్తున్న జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్స్‌లో – ఎంఐజీ లే అవుట్స్‌లోని ప్లాట్లలో 10శాతం ప్లాట్లను రిజర్వ్‌ చేయడమే కాకుండా 20శాతం రిబేటును ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. నియోజకవర్గాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని.. ఉద్యోగులు ఎవ్వరికీ కూడా ఇంటిస్థలం లేదనే మాట లేకుండా చూస్తామని సీఎం హామి ఇచ్చారు. ఆ రిబేటును కూడా ప్రభుత్వమే భరించనుంది. కాగా ప్రభుత్వ నిర్ణయాలపై ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి.

Also Read: Suryapet: భార్యతో వివాహేతర సంబంధం! కోపం పట్టలేక.. దమ్ము చక్రాలతో నుజ్జునుజ్జుగా తొక్కించాడు..

భార్యతో వివాహేతర సంబంధం! కోపం పట్టలేక.. దమ్ము చక్రాలతో నుజ్జునుజ్జుగా తొక్కించాడు..