CM Chandrababu: స్వర్ణాంధ్ర విజన్‌‌పై ఏపీ సర్కార్‌ ఫుల్‌ ఫోకస్‌.. కలెక్టర్లతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం..

|

Mar 25, 2025 | 8:00 AM

వచ్చే ఏడాది నాటికి 15 శాతం వృద్ది సాధించడమే లక్ష్యంగా ప్రణాళికలకు పదును పెడుతోంది ఏపీ సర్కార్‌. అందులో భాగంగా రెండు రోజుల పాటు జిల్లా కలెక్టర్లకు దిశా నిర్దేశం చేస్తారు సీఎం చంద్రబాబు.. ఈ సమావేంలో కలెక్టర్లకు పలు సూచనలు చేయనున్నారు. అంతేకాకుండా.. ఏపీలో జరిగిన భూ అక్రమాలపై ఇంచార్జ్‌ మంత్రులు నివేదికను కూడా అందించనున్నారు.

CM Chandrababu: స్వర్ణాంధ్ర విజన్‌‌పై ఏపీ సర్కార్‌ ఫుల్‌ ఫోకస్‌.. కలెక్టర్లతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం..
CM Chandrababu
Follow us on

స్వర్ణాంధ్ర విజన్‌ 2047పై ఏపీ సర్కార్‌ ఫుల్‌గా ఫోకస్‌ పెట్టింది. ఓవైపు అమరావతి పున: నిర్మాణ పనుల్లో సీఆర్‌డీఏ ముందడుగు వేసింది.24 గ్రామాల అభివృద్ధికి ప్రణాళికలు చేపట్టారు. గ్రాస్‌ లెవల్‌లో అభివృద్ధి, ప్రభుత్వ పథకాల అమలు. చేపట్టాల్సిన కార్యక్రమాలపై రెండు రోజుల పాటు కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో సమీక్షిస్తారు సీఎం చంద్రబాబు.ఏపీ సచివాలయం ఐదో బ్లాక్‌లో నిర్వహించే కలెక్టర్ల సమావేశాన్ని గతానికి భిన్నంగా ప్లాన్‌ చేశారు. గతంలో ఆయా శాఖల కార్యదర్శులతో సమీక్ష నిర్వహించేవాళ్లు. ఇప్పుడు జిల్లాల వారిగా ఆయా కలెక్టర్లు అభివృద్ధి పనులు, ప్రణాళికలపై సీఎం దృష్టికి తీసుకెళ్తారు.

మూడు నెలలకు ఒకసారి కలెక్టర్ల సమావేశాలు నిర్వహించాలని ప్లాన్ చేసిన ఏపీ ప్రభుత్వం ఇప్పటికే రెండు సమావేశాలు నిర్వహించింది మూడవ సమావేశంలో 26 జిల్లాల కార్యాచరణ ప్రణాళికలను ప్రజెంట్ చేయనున్నారు . మొదటి రోజు 9 జిల్లాలు, రెండవ రోజు 17 జిల్లాల కలెక్టర్లు 20 నిమిషాల్లో తమ ప్లాన్‌లను వివరిస్తారు, ఇందులో 10 నిమిషాలు ప్రజెంటేషన్, 10 నిమిషాలు సమస్యలు-పరిష్కారాలపై చర్చ వుంటుంది. కలెక్టర్ల సదస్సులో డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ కూడా పాల్గొననున్నారు.

భూ అక్రమాలపై ఇంచార్జ్‌ మంత్రుల నివేదిక

మొదటి రోజు CCLA ల్యాండ్‌ సర్వే పై ప్రజెంటేషన్ వుంటుంది. గత రెండు సమావేశాల్లో జిల్లా ఇంచార్జ్ మంత్రుల నుండి భూ అక్రమాలపై నివేదికలను కోరారు. ఈ సమావేశంలో వాటిపై చర్చ జరుగుతుంది. అటవీ మరియు పర్యావరణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నగర వనాలు, పచ్చదనం, ఎకో టూరిజం వంటి అంశాలపై ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. సంక్షేమ పథకాల అమలు పై ఆయా శాఖల కార్యదర్శులు ప్రజెంటేషన్ ఉంటుంది.

ఆర్ధిక అసమానతలను రూపుకల్పడమే లక్ష్యంగా ఉగాది నుంచి పబ్లిక్‌,ప్రైవేట్‌..పీపుల్‌ పార్టనర్‌ షిప్‌ పాలసీని అమలు చేస్తామన్నారు సీఎం చంద్రబాబు.మొదటి దశలో 20 లక్షల కుటుంబాలకు ప్రయోజనం కల్పిస్తామన్నారు. 2029 నాటికి పేదరిక నిర్మూలనే లక్ష్యంగా చేపట్టిన P4లో ఎన్నారైలు సహా ఎవరైనా భాగస్వాములు కావచ్చని పిలుపునిచ్చారాయన. కలెక్టర్ల సమావేశంలోనూ ఈ అంశంపై ప్రధానంగా చర్చించారు. ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శి P4 కార్యక్రమంపై వివరించనున్నారు.. రెండవ రోజు సాయంత్రం 5 గంటల తరువాత శాంతి భద్రతలపై కూడా చర్చిస్తారని తెలుస్తోంది.

ముఖ్యంగా వేసవి కాలంలో తాగునీటి సమస్య, పశుగ్రాసం, పశువులకు తాగునీటి లభ్యత, సీజనల్ వ్యాధుల నివారణ, ఉపాధి హామీ పధకం పనులతో పాటు PM సూర్య ఘర్ పధకం కింద ప్రతి నియోజకవర్గంలో 10,000 రూఫ్‌టాప్ సోలార్ ప్యానల్స్ స్థాపనపై కూడా ఈ కలెక్టర్ ల సమావేశం లో ప్రభుత్వం దృష్టి సారించనుంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..