AP Cabintet : ఏపీ మంత్రి వర్గం కీలక నిర్ణయాలు – సంక్షేమ ప‌థ‌కాల‌కు కేబినెట్‌ ఆమోదం..

|

Feb 08, 2023 | 7:14 PM

ఈ క్రమంలోనే ఏపీ కేబినెట్‌ భేటీలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. మంత్రులు బొత్స సత్యనారాయణ, విడదల రజినీని మెచ్చుకున్నారు సీఎం జగన్‌. విద్యాశాఖ, వైద్యారోగ్యశాఖ పనితీరు బాగుందన్నారు. దాంతో,

AP Cabintet : ఏపీ మంత్రి వర్గం కీలక నిర్ణయాలు - సంక్షేమ ప‌థ‌కాల‌కు కేబినెట్‌ ఆమోదం..
Jagan Mohan Reddy
Follow us on

ఏపీ కేబినెట్‌ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఉగాదికి అందించే సంక్షేమ పథకాలకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఉగాది సంబరాలు ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు. అజెండాలోని అన్ని అంశాలకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. భారీ పరిశ్రమల ఏర్పాటుకు మంత్రివర్గం అంగీకారం తెలిపింది. అలాగే, కర్నూలులో రెండో న్యాయ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కొత్తగా తాడేపల్లి గూడెంలో రెవెన్యూ డివిజన్, పోలీస్ డివిజన్‌కు ‎గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 500 మెగావాట్ల ఆదాని హైడ్రో పవర్ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుకు ఆమోదం లభించింది. చిత్తూరు డైరీ రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించాల్సిన 106 కోట్ల మాఫీకి ఏపీ కెబినెట్ ఆమోదం తెలిపింది.

ఏపీ కేబినెట్‌లో మరో కీలక నిర్ణయం ఏంటంటే.. కల్యాణమస్తుకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. కల్యాణమస్తు, షాదీ తోఫాను ఈనెల 10నుంచి అమలు చేయనున్నట్లు చెప్పారు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్‌. . వైఎస్సార్ లా నేస్తం, వైఎస్సార్ ఆసరా, ఈబీసీ నేస్తం, వైఎస్సార్ కల్యాణ మస్తులను మంత్రి వర్గం ఆమోదించింది. జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, రాష్ట్రంలో భారీ పరిశ్రమల ఏర్పాటు ప్రతిపాదనలకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్ బోర్డ్ ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. ప్రధానంగా 70 అజెండా అంశాలపై క్యాబినెట్‌ చర్చించింది.

కర్నూలు జిల్లా డోన్‌ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో బోధనా సిబ్బంది నియామకానికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఈ నెల రైతులకు ఇన్‌ఫుట్‌ సబ్సీడీ చెల్లింపునకు కూడా ఆమోదం లభించింది. ఈ నెల 28న జగనన్న విద్యాదీవెన చెల్లింపునకు కేబినెట్‌ ఆమోదం. 1998 డీఎస్సీ క్వాలిఫైడ్‌ అభ్యర్థుల పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపింది. డిజిటల్‌ క్లాస్‌ రూమ్స్‌ ఏర్పాటు, విశాఖలో టెక్‌ పార్క్‌ ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం లభించింది. అటు, నెల్లూరు బ్యారేజ్‌ను నల్లపురెడ్డి శ్రీనివాసులరెడ్డి బ్యారేజ్‌గా మారుస్తూ నిర్ణయం తీసుకుంది కేబినెట్‌. రామాయపట్నం పోర్టులో 2 క్యాపిటివ్‌ బెర్త్‌ల నిర్మాణానికి ఆమోదం. లీగల్‌ సెల్‌ అథారిటీలో ఖాళీ పోస్టుల భర్తీకి కేబినెట్‌ ఆమోదం లభించింది. పంప్‌ స్టోరేజ్‌ హైడ్రో ప్రాజెక్టులకు అవసరమైన అనుమతులకు ఆమోదం లభించినట్టుగా మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్‌ వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

ఈ క్రమంలోనే ఏపీ కేబినెట్‌ భేటీలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. మంత్రులు బొత్స సత్యనారాయణ, విడదల రజినీని మెచ్చుకున్నారు సీఎం జగన్‌. విద్యాశాఖ, వైద్యారోగ్యశాఖ పనితీరు బాగుందన్నారు. దాంతో, సివిల్ సప్లై కూడా బాగానే పనిచేస్తోంది సార్‌ అంటూ మంత్రి కారుమూరి అనడంతో… అయితే, మిమ్మల్ని కూడా అభినందించాలా అంటూ చమత్కరించారు సీఎం జగన్‌.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ న్యూస్ కోసం..