ఏపీ కేబినెట్‌ కీలక నిర్ణయాలు.. అమరావతిలో క్వాంటం కంప్యూటర్, ఏఐ సంస్థలకు భూముల కేటాయింపు

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ కేబినెట్‌ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఏడాది పాలనపై చర్చించిన మంత్రివర్గం.. ఇప్పటివరకూ సాధించిన లక్ష్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించింది. మంత్రులు ప్రజలకు మరింత దగ్గర కావాలని సీఎం చంద్రబాబు సూచించారు. అలాగే వనమహోత్సవంతో పాటు యోగా డేను ప్రపంచ రికార్డ్‌ నెలకొప్పేలా నిర్వహించాలని నిర్ణయించింది.

ఏపీ కేబినెట్‌ కీలక నిర్ణయాలు.. అమరావతిలో క్వాంటం కంప్యూటర్, ఏఐ సంస్థలకు భూముల కేటాయింపు
Ap Cabinet

Updated on: Jun 04, 2025 | 9:54 PM

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ కేబినెట్‌ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఏడాది పాలనపై చర్చించిన మంత్రివర్గం.. ఇప్పటివరకూ సాధించిన లక్ష్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించింది. మంత్రులు ప్రజలకు మరింత దగ్గర కావాలని సీఎం చంద్రబాబు సూచించారు. అలాగే వనమహోత్సవంతో పాటు యోగా డేను ప్రపంచ రికార్డ్‌ నెలకొప్పేలా నిర్వహించాలని నిర్ణయించింది. రాజధాని అమరావతి నిర్మాణంలో భాగంగా సీఆర్డీఏ నిర్ణయాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. అలాగే పలు సంస్థలకు భూకేటాయింపులు.. ఉద్దానంలో రక్షిత మంచినీటికి నిధుల విడుదల సహా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేబినెట్‌ మీటింగ్‌ నిర్ణయాలను మంత్రి పార్థసారథి వివరించారు.

ఏపీ కేబినెట్‌ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఏడాది పాలనపై సుధీర్ఘంగా చర్చించిన మంత్రివర్గం.. ఇప్పటివరకూ సాధించిన లక్ష్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించింది. అలాగే వనమహోత్సవం, యోగా డే ఏర్పాట్లపైనా చర్చించారు. సీఆర్డీఏ నిర్ణయాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. పలు సంస్థలకు భూకేటాయింపులు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ నిర్మాణానికి ఆమోదం తెలిపింది. విశాఖలో 5 లక్షల మంది యోగాంధ్ర 2025 నిర్వహించి వరల్డ్ రికార్డుకు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 175 నియోజకవర్గాల్లో MSME పార్కుల నిర్మాణానికి 475 కోట్ల రూపాయల ప్రతిపాదనలను ప్రభుత్వం ఆమోదించింది.

ఎన్టీఆర్ సుజల స్రవంతి ద్వారా రక్షిత తాగునీటి సరఫరా కోసం శ్రీకాకుళం జిల్లా ఉద్దానానికి రూ. 5.75 కోట్లు.. కుప్పంలో వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ కోసం రూ. 8.22 కోట్ల విడుదలకు ఆమోదం తెలిపింది ప్రభుత్వం. 17 మంది యావజ్జీవ ఖైదీలకు క్షమాభిక్ష పెట్టింది ఏపీ ప్రభుత్వం. 248 మందిని హెడ్ కానిస్టేబుల్స్‌గా పదోన్నతి కల్పించింది. వైఎస్‌ఆర్ జిల్లా పేరును వైఎస్ఆర్ కడప జిల్లాగా మార్చింది. పోలీసు అకాడమీకి అదనంగా 94.45 ఎకరాలు ఇచ్చేందుకు కేబినెట్‌ ఆమోదించింది. రాత్రి పూట విధులు నిర్వహించే మహిళా ఉద్యోగులకు పూర్తి రక్షణ కల్పించేందుకు చట్ట సవరణలు చేసింది. విశాఖపట్నంలోని యాత్రీ నివాస్‌ను అధునీకరించేందుకు పర్యాటక రంగం పంపిన ప్రతిపాదనల కోసం 13 కోట్ల 50 లక్షల రూపాయలను విడుదల చేసింది. బనకచర్లకు నిధుల సమీకరణపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ ఛేయండి..