ల్యాండ్ పూలింగ్ స్కీమ్‌ సహా పలు కీలక నిర్ణయాలకు ఏపీ కేబినెట్ ఆమోదం

ఆంధ్రప్రదేశ్ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అమరావతిలో మరింత భూసమీకరణ చేపట్టాలని నిర్ణయించిన ఏపీ ప్రభుత్వం.. అందుకోసం ల్యాండ్ పూలింగ్ స్కీమ్‌-2025కు ఆమోదం తెలిపింది. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని ల్యాండ్ పూలింగ్ స్కీమ్‌ను రూపొందించింది. CRDA సమావేశం నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

ల్యాండ్ పూలింగ్ స్కీమ్‌ సహా పలు కీలక నిర్ణయాలకు ఏపీ కేబినెట్ ఆమోదం
Ap Cabinet Meet

Updated on: Jun 24, 2025 | 5:14 PM

ఆంధ్రప్రదేశ్ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అమరావతిలో మరింత భూసమీకరణ చేపట్టాలని నిర్ణయించిన ఏపీ ప్రభుత్వం.. అందుకోసం ల్యాండ్ పూలింగ్ స్కీమ్‌-2025కు ఆమోదం తెలిపింది. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని ల్యాండ్ పూలింగ్ స్కీమ్‌ను రూపొందించింది. CRDA సమావేశం నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇటీవల అమరావతిలో టెండర్లు దక్కించుకున్న సంస్థలకు మంత్రివర్గం అనుమతులు మంజూరు చేసింది.

అమరావతిలో గ్రీన్ ఫీల్డ్‌ ఎయిర్‌పోర్ట్‌ సహా అనేక సంస్థలు వస్తాయని మంత్రి పార్థసారథి తెలిపారు. ల్యాండ్ పూలింగ్‌లో గుర్తించిన భూములన్నింటికీ ఒకే విధానం ఉంటుందన్నారు. అసైన్‌మెంట్, ఎండోమెంట్, లంక భూములపై జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో విచారణ చేయిస్తామన్నారు. భూమి యజమానులను నిర్ధారించే విషయంలో వివాదాలు లేకుండా చూస్తామన్నారు. సర్వే సమయంలో సరిహద్దుల వద్ద సమస్యలు రాకుండా చూస్తామని, ల్యాండ్ పూలింగ్‌కు భూములు ఇచ్చే వారికి మెరుగైన పరిహారం అందిస్తామన్నారు. భూములు ఇచ్చిన రైతుల్లో అర్హులకు లక్షన్నర రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని.. స్థానిక రైతులకు ఉచిత విద్య, వైద్య చికిత్స అందించేలా కేబినెట్ నిర్ణయం తీసుకుందని తెలిపారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..