AP News: ఏపీ బీజేపీ కీలక నిర్ణయం.. ప్రజల ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక యాప్..

|

Aug 10, 2024 | 7:23 AM

ఏపీలో టీడీపీ, జనసేనతో కలిసి అధికారాన్ని పంచుకుంటున్న బీజేపీ.. రాష్ట్రంలో బలపడేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలు, పార్టీ శ్రేణుల నుంచి ఫిర్యాదులు తీసుకునేందుకు కీలక నేతలు అందుబాటులో ఉండబోతున్నారు.

AP News: ఏపీ బీజేపీ కీలక నిర్ణయం.. ప్రజల ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక యాప్..
Ap Bjp
Follow us on

టీడీపీ, జనసేన తరహాలోనే ప్రజల నుంచి ఫిర్యాదులు తీసుకునేందుకు మొదటిసారిగా వారధి అనే కార్యక్రమాన్ని చేపట్టనుంది. ఈనెల 16 నుంచి రాష్ట్ర కార్యాలయంలో ఈ కార్యక్రమం చేపట్టనున్నారు. పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా బీజేపీకి చెందిన ప్రజాప్రతినిధులందరూ ప్రజలకు, కార్యకర్తలకు అందుబాటులో ఉండనున్నారు. ప్రజల నుంచి కేవలం ఫిర్యాదుల స్వీకరించి వదిలేయకుండా.. వాటి పరిష్కారం కోసం కూడా కృషి చేయనుంది బీజేపీ. ఇందుకోసం ప్రత్యేక యాప్ రూపొందించనున్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా ఎవరు ఎప్పుడూ రాష్ట్ర కార్యాలయంలో ఉంటారనే దానిపై కూడా క్లారిటీ ఇచ్చింది ఏపీ బీజేపీ. ప్రతి నెల మొదటి, మూడో సోమవారం రాష్ట్ర పార్టీ ఆఫీస్‌లో ప్రజలు, కార్యకర్తల నుంచి ఫిర్యాదులు స్వీకరించనున్నారు ఏపీ బీజేపీ చీఫ్, ఎంపీ పురంధేశ్వరి. కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ ప్రతి నెల మొదటి, రెండో శనివారం ఈ బాధ్యతలు నిర్వహించనున్నారు. మరో ఎంపీ సీఎం రమేశ్‌ ప్రతి నెలలో మొదటి, రెండో శుక్రవారం కార్యాలయంలో ఉండనున్నారు.

ఇక ప్రతి నెల మొదటి మంగళవారం, మూడో మంగళవారం మంత్రి సత్యకుమార్ రాష్ట్ర కార్యాలయంలో ఫిర్యాదు స్వీకరించనున్నారు. బీజేపీ ఎమ్మెల్యేలు సుజనా చౌదరి, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ఈశ్వరరావు, కామినేని శ్రీనివాసరావు, విష్ణుకుమార్ రాజు, ఆదినారాయణరెడ్డి, పార్థసారధితో పాటు మాజీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు కూడా వివిధ రోజుల్లో ఈ బాధ్యతలు నిర్వహించనున్నారు. ఏపీలో ప్రజలకు, కార్యకర్తలకు అందుబాటులో ఉండేందుకు ఇప్పటికే ఈ ఫార్ములాను అనుసరిస్తున్నాయి టీడీపీ, జనసేన.

టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశాలతో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రోజుకు ఇద్దరు చొప్పున ఆగస్టు 14 వరకు పార్టీ కార్యాలయంలో ఉంటూ వినతులు తీసుకుంటున్నారు. ఆగస్టు ఒకటి నుంచి జనసేన ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం మంగళగిరిలోని పార్టీ ఆఫీసులో ప్రజలు, పార్టీ శ్రేణుల నుంచి ఫిర్యాదులు తీసుకుంటున్నారు. తాజాగా టీడీపీ, జనసేన బాటలోనే నడవాలని డిసైడయిన బీజేపీ.. అందుకు తగ్గట్టుగా షెడ్యూల్ రిలీజ్ చేసింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..