Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP BJP: ఏపీలో పొత్తులపై వ్యూహం మార్చిన బీజేపీ

సార్వత్రిక ఎన్నికల ముంగిట ఏపీలో సరికొత్త ఎత్తులతో ముందుకు వెళ్తోంది బీజేపీ. తమకు కొత్త పొత్తులు అవసరం లేదంటూనే.. చర్చలకు ఆహ్వానిస్తోంది. మాకు ఒకరితో పనిలేదు.. మాతో కలిసి వచ్చే ఆలోచన ఎవరికైనా ఉంటే ముందుకు రావాలంటోంది. సైకిల్ పార్టీతో కలిసిరావాలని కోరుకుంటున్న పవన్‌కి సైతం క్లియర్ కట్ మెసేజ్ ఇచ్చింది కాషాయపార్టీ. అటు బీజేపీ కీలక సమావేశంలోనూ దీనిపై ఆసక్తికర చర్చజరిగింది.

AP BJP: ఏపీలో పొత్తులపై వ్యూహం మార్చిన బీజేపీ
Andhra Bjp
Follow us
Ram Naramaneni

|

Updated on: Jan 04, 2024 | 9:40 PM

ఏపీలో పొత్తులపై బీజేపీ వ్యూహం మార్చింది. ఓవైపు పొత్తులు తమకు అవసరం లేదని చెప్తూనే.. మరోవైపు తమతో కలిసి వచ్చేవాళ్లు ముందుకు రావాలని కోరుతోంది కమలం పార్టీ. రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు.. అలాగే మాతో కలవాలని అనుకుంటున్న పార్టీ కూడా ముందుకు వస్తే పొత్తుల గురించి ఆలోచిస్తామనే సంకేతం రాష్ట్ర బీజేపీ నేతల నుంచి వచ్చింది. పొత్తుల అంశాన్ని బీజేపీ పెద్దల దృష్టికి పవన్ తీసుకెళ్లిన మాట వాస్తవమే.. కానీ మాతో కలవాలనుకునే పార్టీతో పవన్ ముందడుగు వేయించాలి కదా అంటూ ప్రశ్నించారు బీజేపీ నేత సత్యకుమార్.

ఐదున్నర గంటలపాటు సాగిన ఏపీ బీజేపీ ముఖ్య నేతల భేటీలో పొత్తులపైనే వాడీ వేడీ చర్చ జరిగింది. టీడీపీతో పొత్తు పెట్టుకుంటేనే బాగుంటుందని మెజార్టీ నేతలు అభిప్రాయపడినట్టు తెలుస్తోంది. ఈ నెలాఖరులో అమిత్ షా పర్యటనలోపే పొత్తులపై క్లారిటీ ఇవ్వాలని నేతలు కోరినట్టు సమాచారం. అయితే పొత్తులపై అభిప్రాయాలను లిఖిత పూర్వకంగా ఇవ్వాలని పార్టీ నేతలకు సూచించారు బీజేపీ జాతియ నేత శివప్రకాష్‌. బీజేపీ నేతల మీటింగ్ తర్వాత జనసేన నేత నాదెండ్ల మనోహర్‌తో పురంధేశ్వరి భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. పొత్తులతో పాటు తాజా రాజకీయ అంశాల గురించి ఈ భేటీలో చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఇది కేవలం మర్యాదపూర్వక భేటీ మాత్రమే అంటున్నారు నాదెండ్ల.

అటు బీజేపీ నుంచి కూడా ఇదే రియాక్షన్ వచ్చింది. జనసేన తమ మిత్రపక్షం కాబట్టి… నాదెండ్లతో మర్యాదపూర్వక భేటీ మాత్రమే జరిగినట్టు చెప్తున్నారామె. ఎన్నికలకు అతికొద్ది సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో అన్ని పార్టీలు ఎవరి వ్యూహాలు వాళ్లు రచిస్తున్నారు. ఏపీలో బలపడాలని చూస్తున్న బీజేపీ.. పొత్తులపై సరికొత్త ఎత్తులు వేస్తోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…