ఆస‌క్తి రేపుతున్న ఏపీ రాజ‌కీయాలు.. నేడు అసెంబ్లీ కాన్ఫ‌రెన్స్ హాల్‌లో ప్రివిలేజ్ కమిటీ భేటీ

|

Dec 23, 2020 | 7:03 AM

ఏపీ అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ మొదటిసారి భేటీ అవుతుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రాధాన్యత సంతరించుకుంది. నేడు అసెంబ్లీ కాన్ఫ‌రెన్స్ హాల్లో 11గంటలకు ప్రివిలేజ్...

ఆస‌క్తి రేపుతున్న ఏపీ రాజ‌కీయాలు.. నేడు అసెంబ్లీ కాన్ఫ‌రెన్స్ హాల్‌లో ప్రివిలేజ్ కమిటీ భేటీ
Follow us on

ఏపీ అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ మొదటిసారి భేటీ అవుతుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రాధాన్యత సంతరించుకుంది. నేడు అసెంబ్లీ కాన్ఫ‌రెన్స్ హాల్లో 11గంటలకు ప్రివిలేజ్ కమిటి చైర్మన్ కాకాని గోవర్ధన్ రెడ్డితో పాటు 7 గురు సభ్యులతో కూడిన కమిటీ సమావేశమయి ప్రివిలేజ్ మోషన్ విషయంలో కీలక అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.అయితే మొదటి సారి ప్రివిలేజ్ కమిటీ సమావేశమవుతుండగా ఇప్పుడు ఏఏ అంశాలపై కమిటీ చర్చించి ఆమోదిస్తుంది వేటికి ప్రాధాన్యత ఇస్తుందన్న చర్చ ఇప్పుడు పెద్ద ఎత్తున నడుస్తోంది.

ప్రివిలేజ్ కమిటీ మొదటి భేటీ ప్రధానంగా రెండు అంశాలపై జరగబోతుంది. అసెంబ్లీ హాల్లో జరిగే సమావేశానికి కమిటి చైర్మన్ కాకని గోవర్ధన్ రెడ్డితో పాటు కమిటీ సభ్యులు ఎమ్మెల్యే మల్లాది విష్ణు, అప్పలనాయుడు, వర ప్రసాద్, కన్నబాబు, చక్రపాణి రెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్య ప్రసాద్ హాజరు కానున్నారు. ప్రధానంగా ఈ నెల మొదటి వారంలో జరిగిన శాసనసభ సమావేశాల్లో పెన్షన్ల పంపిణీ, రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారుల అంశంపై చర్చ జరుగుతున్న సందర్భంలో ఉద్దేశ్య పూర్వకంగా సభను తప్పుదారి పట్టించేలా వ్యవహరించారని టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడుపై సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేస్తున్నట్లు ప్రకటించారు.

ఇక నిమ్మల రామానాయుడుతో పాటు మరొక ఎమ్మెల్యే అచ్చెన్నాయుడుపైన సైతం ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేశారు. స్పీకర్ తమ్మినేని సీతారాంను ఉద్దేశించి నిమ్మల రామా నాయుడు పరుష పదజాలం ఉపయోగించడంతో పాటు స్పీకర్ చేయిర్ ను అవమానించేలా వ్యవహరించారని, సభా నియమాలను ఉల్లగించడంతో పాటు సభను గందరగోళంకు గురిచేసిందుకు ప్రయత్నించారనే అంశాలపై కమిటీ చర్చించబోతుంది. అయితే వీరి ఇరువురి విషయంలో మోషన్ కావడంతో ఇప్పుడు కమిటీ ఏమి చర్చిస్తుంది. ఏ నిర్ణయం తీసుకుంటుంది అనే ఉత్కంఠత నెలకొంది.

అయితే ప్రివిలేజ్ కమిటీ సమావేశంలో మొదట భేటీ అయిన తరువాత చర్చించి ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. భేటీలో ప్రివిలేజ్ మోషన్ పై చర్చించి, సభలో జరిగిన పరిణామాలు సభ్యులు ఇద్దరు వ్యవహరించిన తీరుపై సుదీర్ఘంగా విచారించిన తరువాత ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే ఇద్దరూ ఎమ్మెల్యేల‌పై మొదటి సారి ప్రివిలేజ్ మోషన్ మూవ్ కావడంతో ఇప్పటికిప్పుడు చర్యలు తీసుకునే అవకాశం లేదని అంటున్నారు సీనియర్ ఎమ్మెల్యేలు.

కమిటీ చర్చించి మొదట ఇద్దరికి నోటీసులు ఇచ్చి వారి నుంచి వివరణ తీసుకుని, ఎమ్మెల్యే ఇచ్చిన వివరణకు కమిటీ సంతృప్తి చెంది మొదట తప్పు కింద మన్నించాలని ఇద్దరు సభ్యులు క్షమాపణ కోరితే చర్యలు తీసుకునే అవకాశం ఉండదని అంటున్నారు సీనియర్ ఎమ్మెల్యేలు. అయితే కమిటీ రేపు విచారించి వివరణ కోరితే ఎమ్మెల్యేలు ఇద్దరు ఎటువంటి స‌మాధానం ఇస్తారనే దానిపై చర్చ నడుస్తోంది. మరోవైపు టీడీపీ ఎమ్మెల్యేలు సైతం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, మంత్రి కన్నబాబు పై సైతం ఇద్దరు ఎమ్మెల్యేలు నిమ్మల రామానాయుడు, అచ్చెన్నాయుడు ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేయాల‌ని స్పీకర్ కు ఫిర్యాదు చేశారు.

అయితే టీడీపీ ఎమ్మెల్యేలపై ఇచ్చిన ఈ మోషన్ స్వీకరించిన స్పీకర్ .. తమ్మినేని మాత్రమే టీడీపీ ఎమ్మెల్యేలు ఇచ్చిన మోషన్ మాత్రం స్వీకరించలేదు. దీంతో బుధ‌వారం జరిగే సమావేశంలో నిమ్మల రామా నాయుడు, అచ్చెన్నాయుడు ప్రధానంగా భేటీ కాబోతోంది. అస్సలు కమిటీ ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందనే చర్చ ఇప్పుడు ఆసక్తి రేకెత్తిస్తోంది.

Agrigold Scam: అగ్రీ గోల్డ్ వ్యవహారంలో స్పీడ్ పెంచిన ఈడీ.. ముగ్గురు డైరెక్టర్లను అరెస్ట్ చేసిన అధికారులు..