AP Election Results 2024: ఏపీలో ఓటమి దిశగా మంత్రులు.. లిస్టులో రోజా, బుగ్గన, బొత్స.. సీఎం తప్ప అందరూ.!

నగరిలో వైకాపా అభ్యర్థి మంత్రి రోజా వెనుకంజ. నగరిలో వైకాపా అభ్యర్థి మంత్రి రోజా వెనుకంజలో ఉన్నారు. తొలి రౌండ్‌ముగిసేసరికి గురజాల తెదేపా అభ్యర్థి యరపతినేని 1311 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

AP Election Results 2024: ఏపీలో ఓటమి దిశగా మంత్రులు.. లిస్టులో రోజా, బుగ్గన, బొత్స.. సీఎం తప్ప అందరూ.!
Ap Ministers

Updated on: Jun 04, 2024 | 11:34 AM

ఏపీలో టీడీపీ-జనసేన కూటమి జోరు చూపిస్తోంది. ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్‌ను దాటేసిన కూటమి.. దాదాపు రాష్ట్రంలోని అన్ని చోట్ల క్లీన్‌స్వీప్ దిశగా దూసుకుపోతోంది. ఇదిలా ఉంటే.. టీడీపీ, బీజేపీ, జనసేన అభ్యర్ధులు.. మొత్తం వైసీపీ సీనియర్లకు షాక్ ఇచ్చారు. వైసీపీ చెందిన అందరు మంత్రులు వెనుకంజలో ఉన్నారు. అటు పార్లమెంట్ నియోజకవర్గాల్లోనూ కూటమి హావా కొనసాగుతోంది.

నగరిలో వైకాపా అభ్యర్థి మంత్రి రోజా వెనుకంజలో ఉన్నారు. తొలి రౌండ్‌ ముగిసేసరికి గురజాల తెదేపా అభ్యర్థి యరపతినేని 1311 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అటు విజయనగరం జిల్లా చీపురుపల్లిలో వైసీపీ అభ్యర్ధి, రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ వెనుకంజలో ఉన్నారు. తొలుత మంత్రి ఆధిక్యంలో కొనసాగగా.. ఆ తర్వాత టీడీపీ అభ్యర్ధి కిమిడి కళా వెంకట్రావు ఆధిక్యంలో ఉన్నారు. అటు గాజువాక నుంచి పోటీ చేస్తున్న వైసీపీ అభ్యర్ధి గుడివాడ అమర్నాద్ కూడా వెనుకంజలో ఉన్నారు. అక్కడ టీడీపీ అభ్యర్ధి పల్లా శ్రీనివాసరావు ఆధిక్యంలో ఉన్నారు.

ఇక సత్తెనపల్లిలో మంత్రి అంబటి రాంబాబు వెనుకంజలో ఉన్నారు. ఇక పుంగునూరులో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెనుకంజలో ఉన్నారు. పెనుగొండలో మంత్రి ఉషశ్రీ చరణ్, గుంటూరు వెస్ట్‌లో విడదల రజని, ఆముదాల వలసలో స్పీకర్ తమ్మినేని సీతారామ్ వెనుకంజలో ఉన్నారు. అటు అమలాపురంలో వైసీపీ అభ్యర్ధి రాపాక వరప్రసాద్ కూడా వెనుకంజలో ఉన్నారు. అటు కొండపి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి, మంత్రి ఆదిమూలపు సురేష్ వెనుకంజలో ఉన్నారు. ఇక్కడ టీడీపీ అభ్యర్ధి డీవీబీ స్వామి 699 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఒక్క పులివెందులలో మాత్రమే సీఎం వైఎస్ జగన్ ముందంజలో కొనసాగుతున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..