AP AGRI POLYCET 2022: ఏపీ అగ్రి పాలిసెట్‌ – 2022 నోటిఫికేషన్‌ విడుదల.. పరీక్ష తేదీ ఇదే!

|

May 24, 2022 | 11:07 AM

ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం (ANGRAU)..2022-23 విద్యా సంత్సరానికి సంబంధించిన వ్యవసాయ, పశువైద్య, ఉద్యనవన, మత్స్య విభాగాలకు చెందిన వివిధ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి అగ్రి పాలిసెట్‌- 2022 (AP Agri Polycet 2022) నోటిఫికేషన్‌..

AP AGRI POLYCET 2022: ఏపీ అగ్రి పాలిసెట్‌ - 2022 నోటిఫికేషన్‌ విడుదల.. పరీక్ష తేదీ ఇదే!
Ap Agri Polycet 2022
Follow us on

AP Agri Polycet 2022 applicaion last date: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం (ANGRAU)..2022-23 విద్యా సంత్సరానికి సంబంధించిన వ్యవసాయ, పశువైద్య, ఉద్యనవన, మత్స్య విభాగాలకు చెందిన వివిధ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి అగ్రి పాలిసెట్‌- 2022 (AP Agri Polycet 2022) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. నోటిఫికేషన్‌కు సంబంధించిన ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

 

వివరాలు:

ఇవి కూడా చదవండి

పరీక్ష: ఏపీ అగ్రి పాలిసెట్‌- 2022

కోర్సు కాలవ్యవధి: రెండేళ్లు/మూడేళ్లు

అర్హతలు: పదో తరగతి/తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. 2022 మే నెలలో పదో తరగతి పరీక్షలకు హాజరైనవారు, పదో తరగతి కంపార్ట్‌మెంటల్‌/ఇంటర్‌ ఫెయిల్‌/మధ్యలో ఆపేసిన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్‌లో ఉత్తీర్ణత సాధించిన వారు, ఉన్నత విద్యనభ్యసిస్తున్నవారు మాత్రం దరఖాస్తు చేసుకోకూడదు.

వయోపరిమితి: విద్యార్ధుల వయసు 15 నుంచి 22 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: పాలిసెట్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన విద్యార్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు రుసుము:

  • జనరల్‌ అభ్యర్ధులకు: రూ. 600
  • ఎస్సీ/ఎస్టీ అభ్యర్ధులకు: రూ. 500

దరఖాస్తులకు చివరి తేదీ: జూన్‌ 1, 2022.

అగ్రి పాలిసెట్‌ 2022 పరీక్ష తేదీ: జులై 1, 2022.

ఇతర పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.