Street Dogs in AP: ఆంధ్రప్రదేశ్ లో కుక్కలకు వ్యాక్సిన్ వేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ర్యాబిస్ వ్యాధి నివారణ , నియంత్రణ చర్యల్లో భాగంగా గ్రామాల్లో తిరిగే వీధి కుక్కలకు ర్యాబిస్ వ్యాధి వ్యాప్తి నిరోధక టీకాలను వేయనున్నారు. ఈ మేరకు ఏపీ పశుసంవర్థక శాఖతో సమన్వయం చేసుకుంటూ పంచాయతీరాజ్‌శాఖ ఈ టీకాల కార్యక్రమ అమలుకు చర్యలు చేపట్టింది.
ఈ కార్యక్రమంలో వభాగంగా వీధి కుక్కలకు ర్యాబిస్ సోకకుండా టీకాలను వేయడంతో పాటు.. కుక్కలలో సంతానోత్పత్తిని నియంత్రించేందుకు ఆపరేషన్ కూడా చేస్తాడు. ఈ మేరకు ఇప్పటికే గ్రామ, మండల స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేయాలంటూ పంచాయతీరాజ్ శాఖ అన్ని జిల్లాల జెడ్పీ సీఈవోలు, డీపీవోలను ఆదేశించింది. రోజుకు ప్రతి మండలంలో కనీసం 10 వీధి కుక్కలకు, జిల్లాలో కనీసం 500 కుక్కలకు టీకాలు వేయాలని భావిస్తున్నారు. జిల్లాల వారీగా వీధి కుక్కల టీకాల పురోగతిని ఎప్పటికప్పుడు కమిషనర్ కార్యాలయానికి తెలియజేయాలని ఆదేశించింది. గత ఏడాది నుంచి ఇప్పటి వరకూ పీలో 72 వేల మంది కుక్క కాటుకు గురయ్యారని అధికారులు అంచనా వేస్తున్నారు.
Also Read: మనసు ప్రశాంతంగా ఉండడం కోసం ఈ యోగాసనాన్ని ట్రై చేయండి..