Vijayawada Kidney Racket: ‘నేను కాదు అసలు సూత్రధారి ఆయనే’.. విజయవాడ కిడ్నీ రాకెట్‌ కేసులో మరో ట్విస్ట్..

|

Jul 11, 2024 | 10:40 AM

విజయవాడలో సంచలనం సృష్టించిన కిడ్నీ రాకెట్‌ వ్యవహారంలో‌ డొంక కదులుతోంది. బాధితుడు మధుబాబు ఇచ్చిన ఇన్ఫర్మేషన్‌తో కిడ్నీ గ్యాంగ్‌ కోసం వేట మొదలైంది. కిడ్నీ దందా వెనుకున్న బ్రోకర్ల కోసం గాలింపు చేపట్టారు పోలీసులు. నాలుగు బృందాలతో ఆపరేషన్‌ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే.. కిడ్నీ రాకెట్‌ వ్యవహారంలో ఐదుగురిపై కేసు నమోదైంది.

Vijayawada Kidney Racket: ‘నేను కాదు అసలు సూత్రధారి ఆయనే’.. విజయవాడ కిడ్నీ రాకెట్‌ కేసులో మరో ట్విస్ట్..
Kidney Racket
Follow us on

విజయవాడలో సంచలనం సృష్టించిన కిడ్నీ రాకెట్‌ వ్యవహారంలో‌ డొంక కదులుతోంది. బాధితుడు మధుబాబు ఇచ్చిన ఇన్ఫర్మేషన్‌తో కిడ్నీ గ్యాంగ్‌ కోసం వేట మొదలైంది. కిడ్నీ దందా వెనుకున్న బ్రోకర్ల కోసం గాలింపు చేపట్టారు పోలీసులు. నాలుగు బృందాలతో ఆపరేషన్‌ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే.. కిడ్నీ రాకెట్‌ వ్యవహారంలో ఐదుగురిపై కేసు నమోదైంది. బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్న అంశాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. మోసం చేసి కిడ్నీ మార్పిడి చేయడం, నకిలీ పత్రాలు సృష్టించడం లాంటి నేరపూరితమైన చర్యలపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కిడ్నీ రాకెట్‌ వ్యవహారంలో బాషా, వెంకట్‌, సుబ్రహ్మణ్యం అనే ముగ్గురి పాత్ర ఉందని పోలీసులు తేల్చారు. అటు.. కిడ్నీ కోల్పోయిన మధుబాబుకు గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స అందిస్తున్నారు.

తాజగా కిడ్నీరాకెట్ వివాదంపై స్పందిస్తూ మధ్యవర్తి వెంకట్ వీడియె రిలీజ్ చేశాడు. తాను సూత్రధారి అన్నట్లు ప్రచారం చేస్తున్నారు కానీ.. మధుబాబే కిడ్నీ రాకెట్ వ్యవహారంలో అస్సలు నేరస్థుడు అంటూ ఆరోపించాడు వెంకట్‌. పథకం ప్రకారమే మధుబాబు ఇదంతా చేస్తున్నాడన్నాడు. తాను ఏ తప్పూ చేయలేదు.. కావాలంటే విచారించండి అంటూ వాపోయాడు వెంకట్‌..

వీడియో చూడండి..

తాను సూత్రధారి అన్నట్లు ప్రచారం చేస్తున్నారని.. ఎలాంటి కిడ్నీ దందాలు చేయట్లేదని.. తాను హెల్ప్ చేశాను అంతే తప్ప.. దందా చేయలేదంటూ వెంకట్‌ పేర్కొన్నాడు.. లీగల్ గైడ్‌లైన్స్‌, అఫిడవిట్ మాత్రమే తాను చూస్తాననని.. వాపోయాడు..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..