Sugali Preethi Bai Case: ప్రీతి బాయ్ కేసులో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు.. తెరపైకి మరో కొత్త వ్యక్తి..

|

Mar 21, 2022 | 3:35 PM

Sugali Preethi Bai case: ఏపీలో సంచలనం సృష్టించిన పదవ తరగతి విద్యార్థిని సుగాలి ప్రీతి బాయ్ కేసు మరో మలుపు తిరిగింది. కొత్త వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకొని

Sugali Preethi Bai Case: ప్రీతి బాయ్ కేసులో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు.. తెరపైకి మరో కొత్త వ్యక్తి..
Sugali Preethi Bai Case
Follow us on

Sugali Preethi Bai case: ఏపీలో సంచలనం సృష్టించిన పదవ తరగతి విద్యార్థిని సుగాలి ప్రీతి బాయ్ అనుమానస్పద మృతి కేసు మరో మలుపు తిరిగింది. కొత్త వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తుండటంతో ఈ కేసు మరోసారి సంచలనంగా మారింది. 2017 లో కర్నూలు నగర శివార్లలోని కట్టమంచి రామలింగారెడ్డి రెసిడెన్షియల్ స్కూల్ హాస్టల్ లో పదవ తరగతి విద్యార్థిని ప్రీతి భాయ్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ కేసులో స్కూల్ కరస్పాండెంట్ ఆయన కుమారులు ఇద్దరు అరెస్టయి ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నారు. బాధితులకు న్యాయం జరగాలని.. హంతకులకు శిక్ష పడాలని డిమాండ్ చేస్తూ.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కర్నూలులో ర్యాలీ చేయడంతో కేసు ప్రాధాన్యత సంతరించుకుంది. ఆ తర్వాత ప్రీతి తల్లిదండ్రులు కర్నూలు పర్యటన లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిశారు. ఈ క్రమంలో న్యాయం చేస్తానని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. ఆయన చెప్పినట్లుగానే ఎనిమిది లక్షల నగదు 5 సెంట్ల ఇంటిస్థలం, భర్తకు ఉద్యోగం, ఐదెకరాల పొలం ప్రభుత్వం ప్రకటించి.. ఇచ్చింది.

అయితే.. ఈ కేసు విచారణను ప్రభుత్వం సీబీఐకి అప్పగించింది. అయితే సీబీఐ ఇంకా ఈ కేసు దర్యాప్తును ప్రారంభించలేదు.. స్థానిక పోలీసులే విచారణ చేస్తున్నారు. ఈ క్రమంలో ఉన్నట్టుండి ఎఫ్ఐఆర్లో లేని వ్యక్తిని పోలీసులు తెరపైకి తెచ్చారు. బళ్లారి చౌరస్తాలో ఆటో మొబైల్ షాప్‌లో ఉద్యోగం చేసే నాగిరెడ్డి అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. ప్రీతి తల్లి పార్వతి, నాగిరెడ్డి భార్య ఇద్దరు అక్కాచెల్లెళ్లు. ఈ కారణంతోనే ప్రీతి తండ్రివి నీవే అంటూ ఒప్పుకోవాలని నాగిరెడ్డిని పోలీసులు చితకబాదినట్లు బాధితుడు వాపోతున్నాడు.

ఇటు ప్రీతి తల్లి కూడా జరుగుతున్న విషయాలపై ఆవేదన వ్యక్తం చేసింది. మలుపుల మీద మలుపులు తిరుగుతున్న ప్రీతి బాయ్ అనుమానాస్పద మృతి కేసుకు సంబంధించి మరిన్ని వివరాలను పోలీసులు వెల్లడించాల్సి ఉంది.

Also Read:

Janasena: సంక్షేమ పాలన అంటే ఇదేనా.. జగన్ సర్కార్‌పై జనసేన విమర్శనాస్త్రాలు

Andhra Pradesh: వల బలంగా అనిపిస్తే ఈ రోజు పండగే అనుకున్నారు.. తీరా బయటకు తీశాక అవాక్కు..