
గుప్తనిధుల కోసం అక్రమంగా తవ్వకాలు జరుపుతున్న 9 మంది ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారందని అరెస్ట్ చేసి పీఎస్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుర్రంకొండ మండలం శ్రీనివాసపురం గండు మారెమ్మ గుడి సమీపంలో గుప్త నిధులు ఉన్నట్లు ముఠా భావించింది. దీంతో గుప్త నిధులను వెలికి తీసేందుకు ఓ జేసీబీ, ట్రాక్టర్‌తో అక్కడికి చేరుకుంది. ఇక గుప్తనిధుల కోసం రంగంలోకి దిగిన ముఠా బండరాయి కింద ఓ భారీ పేలుడు పదార్థం పెట్టి బండరాళ్లను పేల్చింది.
పేలుళ్ల తర్వాత జేసీబీ సహాయంతో తవ్వకాలను స్టార్ట్ చేసింది. అయితే దీన్ని గమనించిన గ్రామస్తులు వెంటనే అలర్ట్ అయ్యారు. వెంటనే విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ముఠాను అదుపులోకి తీసుకున్నారు. వారు తొలుత గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపేందుకు పూజలు చేసినట్లు గుర్తించారు. ఘటన స్థలంలో పూజా సామాగ్రితో పాటు.. తవ్వకాలు జరిపేందుకు వాడిన జేసీబీ, ట్రాక్టర్, ఆటో, 4 బైక్ లను స్వాధీనం చేసుకున్నారు.
9 మంది నిందితులను అదుపులో తీసుకున్న పోలీసులు వారి దగ్గరున్న 9 సెల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని స్టేషన్‌కు తరలించారు. ముఠాలో గుర్రం కొండకు చెందిన 5 మంది, సత్యసాయి జిల్లా నంబుల పూలకుంటకు చెందిన మరో నలుగురు ఉన్నట్టు తెలిపారు. పట్టుబడిన వారిలో A1 పొలం యజమాని గోవిందు, ముస్తాక్ అహ్మద్, మహమ్మద్ అప్సర్, సురేంద్ర, మహేష్, వెంకటేష్, రాము, దేవేంద్ర, ఖాదర్ బాషాలు ఉన్నారు.
వీడిమో చూడండి..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.