ఆగస్టు 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్నా క్యాంటీన్లను పునఃప్రారంభించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. మొత్తం 33 మున్సిపాలిటీలలో వంద అన్న క్యాంటీన్లను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలివిడతగా ఎంపిక చేసిన కేంద్రాల వద్ద వీటిని ప్రారంభించనున్నారు. ఆపై మరికొన్ని చోట్ల అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే జిల్లాల్లో ఆయా పురపాలిక సంఘాల పరిధిలో క్యాంటీన్లు ప్రారంభించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. సీఎం చంద్రబాబు కృష్ణా జిల్లా గుడివాడలో తొలి అన్న క్యాంటీన్ ప్రారంభించనున్నారు. మిగతా 99 అన్న క్యాంటీన్లు మరుసటిరోజు మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రారంభించనున్నారు.
గతంలో తెలుగుదేశం హయాంలో చాలాచోట్ల వీటిని ఏర్పాట్లు చేశారు. కేవలం రూ.5కే ఆహారాన్ని పెట్టేవారు. జగన్ ప్రభుత్వం వీటిని పక్కన పెట్టడంతో శిథిలావస్థకు చేరుకున్నాయని మంత్రి నారాయణ తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో క్యాంటీన్లకు పూర్వ వైభవం రానుందన్నారు. పట్టణ ప్రాంతాల్లో 180, గ్రామీణ ప్రాంతాల్లో 200కు పైగా అన్నా క్యాంటిన్లు ప్రారంభించేలా ప్రణాళిక రూపొందించామన్నారు. పేద వర్గాలు ఎక్కువగా తిరిగే మార్కెట్లు, ఆసుపత్రుల వద్ద క్యాంటిన్ల ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. అన్న క్యాంటీన్లు తిరిగి తెరుచుకుంటూ ఉండటంపై హర్షం వ్యక్తమవుతోంది. రోజువారీ కూలీలు, కార్మికులకు అన్న క్యాంటీన్లు ద్వారా ఆకలి తీరుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
వారంలో ఏయే రోజుల్లో ఏయే ఫుడ్ ఐటమ్స్ అందుబాటులో ఉంటాయో తెలుసుకుందాం పదండి….
ఇడ్లీ, చట్నీ/పొడి, సాంబార్ లేదా పూరి, కుర్మా
వైట్ రైస్, కూర, పప్పు/సాంబార్, పెరుగు, పచ్చడి
ఇడ్లీ, చట్నీ/పొడి, సాంబార్ లేదా ఉప్మా, చట్నీ/పొడి, సాంబార్, మిక్చర్
వైట్ రైస్, కూర, పప్పు, సాంబార్, పెరుగు, పచ్చడి
ఇడ్లీ, చట్నీ/పొడి, సాంబార్ లేదా పొంగల్, చట్నీ/పొడి, సాంబార్, మిక్చర్
వైట్ రైస్, కూర, పప్పు/సాంబార్, పెరుగు పచ్చడి
ఇడ్లీ, చట్నీ/పొడి, సాంబార్ లేదా పూరి, కుర్మా
వైట్ రైస్, కూర, పప్పు/సాంబారు, పెరుగు, పచ్చడి
ఇడ్లీ, చట్నీ/పొడి, సాంబార్ లేదా ఉప్మా, చట్నీ/పొడి, సాంబారు, మిక్చర్
వైట్ రైస్, కూర, పప్పు/సాంబార్, పెరుగు, పచ్చడి
ఇడ్లీ, చట్నీ/పొడి, సాంబారు లేదా పొంగల్, చట్నీ/పొడి, సాంబారు, మిక్చర్
వైట్ రైస్, కూర, పప్పు/సాంబారు, పెరుగు, పచ్చడి
#*ఆగస్టు 15వ తేదీ ప్రారంభమయ్యే అన్న క్యాంటీన్ ల మెనూ…#AndhraPradesh pic.twitter.com/k0ei2zafA4
— Koteswararao Guduru (@Koteswa80627861) August 13, 2024
టిఫిన్ ఉదయం 7.30 గంటల నుంచి 10 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. మధ్యాహ్నం భోజనం.. 12.30 గంటల నుంచి 3 గంటల వరకు ఉంటుంది. రాత్రి భోజనం 7.30 గంటల నుంచి 9 గంటల వరకు ఉంటుంది. ఉప్మా, పొంగల్-250 గ్రాములు, ఇడ్లీ, పూరి-3, అన్నం – 400 గ్రాములు, చట్నీ/పొడి – 15 గ్రాములు, సాంబారు- 150 గ్రాములు, పప్పు/సాంబారు – 120 గ్రాములు, కూర – 100 గ్రాములు, మిక్చర్ – 25 గ్రాములు, పెరుగు- 75 గ్రాములు అందిస్తారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..