AP-TS Water Disputes: కృష్ణా జలాలకు సంబంధించి కేంద్రం గెజిట్ విడుదల చేయడంపై ఆంధ్రప్రదేశ్ మంత్రులు బాలినేని శ్రీనివాస్, ఆదిమూలపు సురేష్ స్పందించారు. ఈ మేరకు కామెంట్స్ చేశారు. తొలుత ఈ అంశంపై మీడియాతో మాట్లాడిన బాలినేని.. కేంద్రం రాష్ట్రాలకు తండ్రి వంటిదని, ఇద్దరు పిల్లలు గొడవ పడుతుంటే తండ్రి న్యాయం చేసే విధంగా కేంద్రం నీటి పంపకాల విషయంలో గెజిట్ విడుదల చేసిందని పేర్కొన్నారు. కేంద్రం తీసుకున్న నిర్ణయంలో ఏమాత్రం తప్పు లేదన్నారు. ఇదే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు తీరుపై మంత్రి బాలినేని శ్రీనివాస్ తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణా ప్రభుత్వం అక్రమంగా నీటిని తరలిస్తుంటే మాట్లాడని చంద్రబాబు.. ఆంధ్రప్రదేశ్‌లో ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేవిధంగా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడితే కేసీఆర్ ఓటుకు నోటు కేసు ముందుకు తీసుకువస్తారని చంద్రబాబుకు భయం పట్టుకుందని విమర్శించారు. ఇదికూడా చదవండి: Telangana: ఆదిలాబాద్‌లో గోదాములపై అధికారుల దాడులు.. అనుమతిలేని గోదుమ పిండి నిల్వలు సీజ్.. పలువురి అరెస్ట్..
ఇదిసమయంలో కేంద్ర గెజిట్‌పై మంత్రి ఆదిమూలపు సురేష్ కూడా ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. తెలంగాణలో ఎన్నికల కోసమో.. ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కొనేందుకో నీటి వివాదాన్ని తెరపైకి తీసుకువస్తున్నారని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్‌కు చట్టబద్దంగా, న్యాయబద్దంగా రావాల్సిన గ్లాసు నీటిని కూడా వదులుకోబోమని మంత్రి సురేష్ తేల్చి చెప్పారు. అలాగే ఒక్క గ్లాసు కూడా తమకు ఎక్కువ అవసరం లేదని వ్యాఖ్యానించారు. అన్ని ప్రాంతాలకు సమానంగా, న్యాయబద్దంగా నీటిని తరలించాలనేదే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆకాంక్ష అని పేర్కొన్నారు. కేంద్రం సరైన సమయంలో.. సరైన ప్రకటన విడుదల చేసిందని మంత్రి సురేష్ పేర్కొన్నారు. ఇదికూడా చదవండి: Viral Video : సరదా తీర్చిన ఉయ్యాల.. పట్టు తప్పి 6300 అడుగుల లోయలోకి పడిపోయారు.. అయినా బ్రతికి బయటపడ్డారు..