AP CM: ఏపీ సీఎం జగన్‌ మరో కీలక నిర్ణయం.. ఆ మూడు కులాలకు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ

|

May 21, 2021 | 6:22 PM

AP CM: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ రాష్ట్ర ప్రజల కోసం కొత్తకొత్త నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రజలకు మేలు జరిగే విధంగా ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటూ..

AP CM: ఏపీ సీఎం జగన్‌ మరో కీలక నిర్ణయం.. ఆ మూడు కులాలకు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ
Ap Cm Ys Jagan
Follow us on

AP CM: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ రాష్ట్ర ప్రజల కోసం కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రజలకు మేలు జరిగే విధంగా ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇప్పుడు తాజాగా సీఎం జగన్‌ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని అనేక కులాలకు చెందిన ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన జగన్‌ ప్రభుత్వం.. తాజాగా రాష్ట్రంలో అగ్ర కులాలైన రెడ్డి, కమ్మ, క్షత్రియ సామాజికవర్గాలకు సైతం ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఈ మూడు సామాజిక వర్గాల్లో కొందరు ఎక్కువ భూములు కలిగి మంచి వ్యవసాయ వసతులు కలిగి ఉన్నప్పటికీ.. ఎక్కువమంది ఆర్థికంగా ఆశించిన స్థాయిలో లేరని ప్రభుత్వం వెల్లడించింది.ఈ వర్గాల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది.

ఇక జగన్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీల్లోకి అనేక కులాలతో పాటు షెడ్యూల్‌ కులాల్లోకి కొన్ని కులాల సంక్షేమం, అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి జగన్‌ ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. బీసీ కులాల జనాభా ప్రాతిపదికన గతంలో ఎన్నడూ లేని విధంగా ఎక్కువ కార్పొరేషన్లను ఏర్పాటు చేశారు. 139 బీసీ కులాలకు వెనుకబడిన తరగతుల శాఖ కొత్తగా కొత్తగా 56 బీసీ కార్పొరేషన్లును ఏర్పాటు చేసింది. 10 లక్షలకుపైగా జనాభా ఉన్న కార్పొరేషన్‌లను ‘ఏ’ కేటగిరీ కింద, లక్ష నుంచి పది లక్షల వరకు జనాభా ఉన్న కార్పొరేషన్‌లను ‘బి’ కేటగిరీ కింద, లక్షలోపు జనాభా ఉన్న కార్పొరేషన్‌లను ‘సి’ కేటగిరీగా విభజించారు. ఈ కార్పొరేషన్లకు ఛైర్మన్లు, డైరెక్టర్లను నియమించారు.

ఇవీ కూడా చదవండి:

Indian Museums: భారతదేశంలో చూడదగిన ఐదు ప్రత్యేక మ్యూజియాలు ఇవే.. చరిత్ర ఏంటో తెలుసుకుందాం..!

నెల్లూరు ఆయుర్వేద మందుపై అధ్యయనం చేయాలి: ఆయూష్‌, ఐసీఎంఆర్‌కు సూచించిన ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు

Oxygen: మీ మొబైల్‌లోనే ఆక్సిజన్‌ స్థాయి తెలుసుకోవచ్చు.. యాప్‌కు రూపకల్పన చేసిన కోల్‌కతాకు చెందిన అంకుర సంస్థ