Coronavirus: ఏపీలో రోజురోజుకు రికార్డు స్థాయిలో కరోనా కేసులు.. గడిచిన 24 గంటల్లో ఎన్ని కేసులు నమోదయ్యాయంటే..!

|

Apr 25, 2021 | 6:43 PM

AP Corona Updats: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి కొరల చాస్తోంది. ప్రతి రోజు రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా గడిచిన..

Coronavirus: ఏపీలో రోజురోజుకు రికార్డు స్థాయిలో కరోనా కేసులు.. గడిచిన 24 గంటల్లో ఎన్ని కేసులు నమోదయ్యాయంటే..!
Ap Coronavirus
Follow us on

AP Corona Updats: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి కొరల చాస్తోంది. ప్రతి రోజు రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో 62,885 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, కొత్తగా 12,634 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 69 మంది మృతి చెందినట్లు ఏపీ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 10,33,560 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 1,59,31,722 కరోనా శాంపిళ్లను సేకరించి పరీక్షించింది.

ఇక కరోనాతో కృష్ణా జిల్లాలో అత్యధికంగా 12 మంది ప్రాణాలు కోల్పోయారు. నెల్లూరులో ఏడుగురు, తూర్పు గోదావరి, శ్రీకాకుళం, విశాఖ, పశ్చిమ గోదావరిలో ఆరుగురు చొప్పున, అనంతపురం, కడప ఐదుగురు చొప్పున, చిత్తూరు, గుంటూరులో నలుగురు చొప్పున, ప్రకాశం, విజయనగరంలో ముగ్గురు చొప్పున, కర్నూలులో ఇద్దరు మరణించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 7,685 మంది మృతి చెందారు. ఇక తాజాగా 4,304 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 9,36,143కి చేరినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 89,732 యాక్టివ్‌ కేసులున్నాయి.

ఇవీ చదవండి:

పరిశ్రమలపై మళ్లీ కరోనా పిడుగు.. ప్లాస్టిక్‌, సిమెంట్‌, స్టీల్‌ ధరలకు రెక్కలు..కోవిడ్‌తో ముడిసరుకుపై తీవ్ర ప్రభావం

Auto Driver: ఆయన ఆటోలో కరోనా పేషెంట్లకు ఉచిత ప్రయాణం.. ఓ ఆటో డ్రైవర్‌ ఔదార్యం.. జనాల ప్రశంసలు

India Vaccination: జోరుగా వ్యాక్సినేషన్ ప్రాసెస్.. మరికొన్ని టీకాలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. వచ్చేది ఎప్పుడంటే?