Andhrapradesh Corona Updeates: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది. రోజురోజుకు కరోనా కేసులు తీవ్ర స్థాయిలో నమోదవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో 98,214 శాంపిళ్లను పరీక్షించగా, అందులో కొత్తగా 19,412 పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఏపీ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇక కరోనా బారిన విజయనగరంలో ఎనిమిది మంది, విశాఖలో ఏడుగురురు, చిత్తూరులో ఏడుగురు, తూర్పు గోదావరిలో ఏడుగురు, అనంతపురంలో ఆరుగురు, ప్రకాశంలో ఐదుగురు, కర్నూలులో ఐదుగురు, కృష్ణాలో ఐదుగురు, నెల్లూరులో నలుగురు, గుంటూరులో ఇద్దరు, కడపలో ఇద్దరు, శ్రీకాకుళంలో ఇద్దరు, పశ్చిమగోదావరిలో ఒక్కరు చొప్పున మొత్తం 61 మంది మృతి చెందినట్లు తెలిపింది. ఇక గడిచిన 24 గంటల్లో 11,579 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 11211025 ఉండగా, మరణాలు 8,053 ఉన్నాయి. ఇక రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 13,07,552 ఉండగా, కోలుకున్నవారి సంఖ్య 98,2,297 మంది ఉన్నారు.
అనంతపురం 1722, చిత్తూరులో 2768, ఈస్ట్ గోదావరి -2679, గుంటూరు – 1750, కడప -792, కృష్ణా – 694, కర్నూలు – 1381, నెల్లూరు – 1091, ప్రకాశం – 1106, శ్రీకాకుళం – 2048, విశాఖ – 1722, విజయనగరం – 606, వెస్ట్ గోదావరి – 1053 చొప్పున నమోదయ్యాయి.
#COVIDUpdates: 01/05/2021, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 11,18,207 పాజిటివ్ కేసు లకు గాను
*9,79,402 మంది డిశ్చార్జ్ కాగా
*8,053 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 1,30,752#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/jHC3h30ICm— ArogyaAndhra (@ArogyaAndhra) May 1, 2021