AP Corona Update: ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గతంలో పాజిటివ్ కేసుల సంఖ్య తీవ్రంగా ఉండగా, ప్రస్తుతం తగ్గుముఖం పట్టింది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 28,268 కరోనా పరీక్షలు నిర్వహించగా, 70 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే ఒకరు మృతి చెందారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్‌ను విడుదల చేసింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 8,89,409 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఇప్పటి వరకు 7,168 మంది మృతి చెందారు. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్టర్ంలో 84 మంది పూర్తిగా కోలుకోగా, ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 8,81,666 ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 575 యాక్టివ్ కేసులున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,37,75,253 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు తెలిపింది.