CM Jagan Visakha Tour: ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ విశాఖ పర్యటన.. ఖరారైన షెడ్యూల్‌

|

Jul 11, 2022 | 9:30 AM

CM Jagan Visakha Tour: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విశాఖ పర్యటన షెడ్యూల్‌ ఖరారైంది. ఈనెల 13న ఉదయం 10.30 గంటలకు..

CM Jagan Visakha Tour: ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ విశాఖ పర్యటన.. ఖరారైన షెడ్యూల్‌
Cm Jagan
Follow us on

CM Jagan Visakha Tour: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విశాఖ పర్యటన షెడ్యూల్‌ ఖరారైంది. ఈనెల 13న ఉదయం 10.30 గంటలకు విశాఖ విమనాశ్రయానికి విచ్చేస్తారు. 11.05 గంటలకు ఏయూ ఇంజినీరింగ్‌ కాలేజీ గ్రౌండ్‌కు చేరుకుంటారు. అక్కడ 11.15 గంటల వరకు ఏర్పాటు చేస్తాన స్టాళ్లను సందర్శిస్తారు. అనంతరం వైఎస్సార్‌ వాహణ మిత్ర ఫోటో ఎగ్జిబిషన్‌ను తిలకిస్తారు. ఆ తర్వాత వైఎస్‌ఆర్‌ వాహనమిత్ర లబ్దిదారులతో ఫోటో సెషన్‌ జరుగుతుంది.

ఇక 11.40 గంటల నుంచి 11.45 గంటల వరకు లబ్దిదారుల ప్రసంగాలుంటాయి. 11.47కు వాహన మిత్ర అంశంపై వీడియో ప్రదర్శన, అంనతరం సీఎం జగన్‌ ప్రసంగం ఉంటుంది. 12.20 గంటలకు వైఎస్సార్‌ వాహనమిత్ర లబ్దిదారులకు చెక్కుల పంపిణీ కార్యక్రమం. 12.55 గంటలకు జగన్‌ విమానాశ్రయానికి బయలుదేరి అక్కడ 1.15 గంటల వరకు స్థానిక నాయకులతో భేటీ అవుతారు. 1.20 గంటలకు గర్నవరంకు బయలుదేరుతారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి