Trending: ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు.. కానీ పెద్దలు ఊ అన్నారా..ఊహూ అన్నారా
ప్రేమ (Love) రెండక్షరాలే కానీ.. అది చేసే హడావిడి మాములూగా కాదు. ప్రేమంటే ఏమిటో ఇప్పటికీ సరిగ్గా తెలియనప్పటికీ.. ప్రేమలో పడిన వారికి మాత్రమే దాని విలువేంటో తెలుస్తుందని పలువురు చెబుతుంటారు...
ప్రేమ (Love) రెండక్షరాలే కానీ.. అది చేసే హడావిడి మాములూగా కాదు. ప్రేమంటే ఏమిటో ఇప్పటికీ సరిగ్గా తెలియనప్పటికీ.. ప్రేమలో పడిన వారికి మాత్రమే దాని విలువేంటో తెలుస్తుందని పలువురు చెబుతుంటారు. ప్రేమ ఎప్పుడు ఎక్కడ ఎవరిపై కలుగుతుందో చెప్పలేం. కులం, మతం, ప్రాంతంతో పని ఉండదు. ఈ ప్రపంచంలో పూర్తి స్వతంత్రం కలిగింది ఏదైనా ఉంది అంటే అది ప్రేమే. ఒక్కసారి అది ఎంట్రీ ఇచ్చిందంటే దానిని సాధించుకోడానికి ఆ ప్రేమికులు యుద్ధం చేయాల్సిందే. అంత పవర్‌ఫుల్ మరి. కొందరి విషయంలో యుద్ధాలు లేకుండానే శాంతియుతంగానే ప్రేమ ఫలిస్తుంది. తాజాగా అలాంటి ఘటనే తూర్పుగోదావరి (East Godavari District) జిల్లాలో జరిగింది. కాకినాడకు చెందిన రాజాల ఉదయ్‌శంకర్, కుసుమ దంపతులు విజయవాడలో స్థిరపడ్డారు. వీరి కుమార్తి నివేదిత పై చదువుల కోసం 2016లో అమెరికా వెళ్లింది. అక్కడే చదువు పూర్తి చేసుకుని సాఫ్ట్‌వేర్ ఉద్యోగం సాధించింది.
ఆమె తనతో పాటు పని చేస్తున్న చికాగోకు చెందిన బైరాన్ అనే వ్యక్తితో ప్రేమలో పడింది. అతన కూడా నివేదితపై మనసు పారేసుకున్నాడు. ఇంకేముంది అదే విషయాన్ని ఆ అమ్మాయికి చెప్పాడు. దాంతో ఆంధ్రా అమ్మాయి తన తల్లిదండ్రుల అంగీకారం అవసరమని చెప్పింది. ఇద్దరూ కలిసి విషయాన్ని అమ్మాయి తల్లిదండ్రులకు చెప్పారు. వారు కూడా వీరి ప్రేమకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గోకవరం మండలంలోని కృష్ణునిపాలెంలో ఉన్న నివేదిత బంధువుల ఇంట్లో నిశ్చితార్థం చేసుకున్నారు. ఆగస్టు 11న విజయవాడలో ఆంధ్రా అమ్మాయికి, చికాగో అబ్బాయికి పెళ్లి జరగనున్నట్టు బంధువులు వెల్లడించారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి