AP News: ఏపీలో తుది ఓటర్ జాబితా విడుదల.. మొత్తం ఓట్ల సంఖ్య ఎంతంటే..?

ఏపీలో ఓటర్ లిస్ట్ తుది జాబితాను విడుదల చేసింది ఎన్నికల సంఘం. రాష్ట్రంలో మొత్తం 4 కోట్ల 8 లక్షల 756 మంది ఓటర్లు ఉన్నట్టు ప్రకటించింది. ముసాయిదా జాబితాతో పోల్చితే తుది జాబితాలో దాదాపు 6 లక్షల ఓట్లు పెరిగాయి. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి...

AP News: ఏపీలో తుది ఓటర్ జాబితా విడుదల.. మొత్తం ఓట్ల సంఖ్య ఎంతంటే..?
Voters

Updated on: Jan 22, 2024 | 7:26 PM

ఏపీలో తుది ఓటరు జాబితాను విడుదల చేసింది ఎన్నికల సంఘం. ఈ జాబితా ప్రకారం రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 4 కోట్ల 8 లక్షల 7 వేల 256. వీరిలో పురుష ఓటర్లు 2 కోట్ల 9 వేల 275 కాగా, మహిళా ఓటర్ల సంఖ్య 2 కోట్ల 7 లక్షల 37 వేల 65. థర్డ్ జెండర్ ఓట్ల సంఖ్య 3482గా ఉంది. ఇక ఏపీలో సర్వీస్ ఓటర్ల సంఖ్య 67,434.

గ‌త అక్టోబ‌ర్ 27న ముసాయిదా ఓట‌ర్ జాబితాను విడుద‌ల చేసింది ఎన్నికల సంఘం. అయితే దీని కంటే తుది జాబితాలో ఓటర్ల సంఖ్య పెరిగింది. సుమారు 6 లక్షల మేర ఓటర్ల సంఖ్య పెరిగింది. కర్నూలు జిల్లాలో అత్యధికంగా 20,16,396 ఓట్లు, అల్లూరి జిల్లాలో అత్యల్పంగా 7,61,538 ఓట్లు ఉన్నాయి. అఖిలపక్ష నేతలతో సమావేశమైన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా.. తుది ఓటరు జాబితాను సంబంధించిన హార్డ్ డిస్క్‌లను వారికి అందించారు.

ఎన్నిక సంఘం విడుదల చేసిన ఓటర్ల తుది జాబితాను జిల్లాలు, నియోజకవర్గాలు, గ్రామాల స్థాయిలో ప్రచురించింది. అసెంబ్లీ స్థానాల వారీగా ఓటర్ల జాబితాలను ఎన్నికల సంఘం ప్రచురించింది. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా, అందులోనూ గ్రామాలు, పట్టణాల వారీగా పీడీఎఫ్ ఓటర్ల జాబితాలను సీఈఓ ఆంధ్రా వెబ్‌సైట్‌లో ఎన్నికల సంఘం అప్ లోడ్ చేసింది.

మరోవైపు ఏపీలో ఎన్నికల సన్నద్ధతపై సీఎస్‌ జవహర్‌ రెడ్డి సమీక్ష నిర్వహించారు. పోలింగ్‌ కేంద్రాల్లో కల్పించాల్సిన సౌకర్యాలు, సిబ్బంది ఖాళీలు తదితర అంశాలపై చర్చించారు. జనవరి 31వ తేదీలోగా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల విధులతో సంబంధం ఉన్న అధికారులు, సిబ్బంది బదిలీలపై సమీక్ష చేపట్టారు. ఇప్పటి వరకు వివిధ శాఖలకు చెందిన సుమారు 2 వేల మందిని బదిలీ చేసినట్టు తెలిపారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..