AP: “నా చావుకు నేనే కారణం.. ఇక నీకు కనిపించనులే అమ్మాయ్”.. అతని ఆఖరి లేఖ

|

May 24, 2022 | 2:54 PM

ప్రేమ మరో యువకుడి జీవితాన్ని బలి తీసుకుంది. ప్రేయసి తనకు దక్కలేదన్న బాధతో ఓ యువకుడు చెట్టుకు ఉరి వేసుకుని తనువు చాలించాడు.

AP: నా చావుకు నేనే కారణం.. ఇక నీకు కనిపించనులే అమ్మాయ్.. అతని ఆఖరి లేఖ
Man Ends Life
Follow us on

ఆ రచ్చ బండ ఎప్పుడూ జనంతో కిటకిటలాడుతూ ఉండేది… ఎప్పటిలాగే ఈ నెల 21వ తేదిన సాయంత్రం నాలుగు గంటల వరకూ జనం రచ్చబండపై ముచ్చట్లు చెప్పుకున్నారు. మరో రెండు గంటల తర్వాత అక్కడ నిశ్శబ్దం నెలకొంది. ఆ సమయంలో అక్కడికి వచ్చిన ఒక యువకుడు ఎవరూ లేరని నిర్ధారించుకుని..  తనతో తెచ్చుకున్న తాడుతో రచ్చబండ చెట్టుకు ఉరేసుకొని చనిపోయాడు. వివరాల్లోకి వెళ్తే… రొంపిచర్ల మండలం(Rompicherla Mandal) విప్పర్లకు చెందిన గోపి రాజు వినుకొండ(Vinukonda)లో జేసీబీ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. మూడు రోజుల క్రితమే వినుకొండ వచ్చాడు. తిరిగి ఇంటికి వెళ్తున్నా అని స్నేహితులతో చెప్పిన గోపిరాజు ఈపూరు మండలం(Ipur Mandal) బోడిశంభునిపాలెం వద్ద చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అందరూ కష్టాలు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడని అనుకున్నారు. అయితే అతని మరణానికి ముందు రాసిన లెటర్ ఇప్పుడు చక్కెర్లు కొడుతుంది. నా మృతదేహాన్ని మా అన్నకు ఇవ్వండి అంటూ మొదలు పెట్టిన లేఖలో… ఏయ్ అమ్మాయ్ నువ్వే గెలిచావ్…. నేను జీవితంలో మొదటి సారి ఓడిపోయా… ఇక నీకు కనిపించనులే… నేను ఏ తప్పు చేయలేదు… నిన్నే భార్యగా ఊహించుకున్నా… నువ్వు లేని జీవితాన్ని ఊహించుకోలేను… నిన్ను మర్చిపోవాలంటే నేను చచ్చిపోవాలి.. ఐ మిస్‌యూ.. లైఫ్‌లో ఎప్పుడూ కనిపించను.. ‘నా చావుకు నేనే కారణం’  అని లేఖ ముగించాడు. ఈ లెటర్ అందరిని ఆవేదనకు గురి చేస్తోంది. ఏ అమ్మాయిని ప్రేమించాడో ఎవరికీ తెలియదు కానీ ప్రేమించిన అమ్మాయి కోసమే చనిపోయాడని తెలుసుకొని అయ్యో పాపం అంటున్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

రిపోర్టర్: టి నాగరాజు, టివి9 తెలుగు, గుంటూరు