Rain Alert: ఏపీలో వచ్చే 3 రోజుల వాతావరణ ఇలా.. ఈ జిల్లాలకు ఉరుములతో వర్షం

ఆంధ్రప్రదేశ్ వాతావరణ విశేషాలు ఎలా ఉండబోతున్నాయ్. అల్పపీడన ప్రభావం కారణంగా రాష్ట్రంలో ఎక్కడెక్కడ వర్షాలు కురుస్తాయ్. వచ్చే 3 రోజుల వాతావరణ వివరాలు ఇలా ఉన్నాయి. ఓసారి లుక్కేద్దాం. ఈ స్టోరీ చూసేయండి మరి. ఇదిగో వర్షాలు ఇలా ఉంటాయి ఇలా.

Rain Alert: ఏపీలో వచ్చే 3 రోజుల వాతావరణ ఇలా.. ఈ జిల్లాలకు ఉరుములతో వర్షం
Andhra Weather Report

Updated on: Sep 04, 2025 | 2:00 PM

ఉత్తర ఛత్తీస్‌గఢ్ దాని పరిసర ప్రాంతాలలోని నిన్నటి అల్పపీడనం ఈరోజు, సెప్టెంబర్ 04, 2025న ఉదయం 0830 గంటలకు IST సమయానికి పశ్చిమ-వాయువ్య దిశగా నెమ్మది గా కదులుతూ, ఉత్తర ఛత్తీస్‌గఢ్ దానికి ఆనుకుని ఉన్న తూర్పు మధ్యప్రదేశ్ మీదుగా వ్యాపించింది. అనుబంధ ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 5.8 కి.మీ ఎత్తు వరకు విస్తరించి, ఎత్తుకు వెళ్ళేకొలది నైరుతి దిశగా వంగి ఉంది. రాబోయే 24 గంటల్లో తూర్పు మధ్యప్రదేశ్ మీదుగా పశ్చిమ-వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉంది.

సగటు సముద్ర మట్టం వద్ద రుతుపవన ద్రోణి ఇప్పుడు జైసల్మేర్, కోట, నర్మదాపురం, సియోని, దుర్గ్ గుండా వెళుతూ, ఉత్తర ఛత్తీస్‌గఢ్ దాని ప్రక్కనే ఉన్న తూర్పు మధ్యప్రదేశ్, చాంద్‌బలి మీదుగా అల్పపీడన ప్రాంతం కేంద్రంగా మీదగా అక్కడ నుండి తూర్పు ఆగ్నేయం వైపు వాయువ్య బంగాళాఖాతం వరకు విస్తరించి ఉంది. ఇది సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తు వరకు విస్తరించి, పై ఉపరితల ఆవర్తనం గుండా ప్రయాణిస్తుంది. దక్షిణ గుజరాత్, సౌరాష్ట్ర మీదుగా ఒక ద్రోణి ఈశాన్య అరేబియా సముద్రం నుండి వాయువ్య బంగాళాఖాతం వరకు ప్రయాణిస్తుంది. , మధ్యప్రదేశ్ దాని పరిసర ప్రాంతాలలో ఉపరితల ఆవర్తనం ఉంది., అల్పపీడన ప్రాంతంతో సంబంధం ఉన్నఉపరితల ఆవర్తనం ఉత్తర ఛత్తీస్‌గఢ్ దాని ఆనుకుని ఉన్న తూర్పు మధ్యప్రదేశ్ ఒడిశా మీదుగా సగటు సముద్ర మట్టానికి 3.1 & 5.8 కి.మీ మధ్య విస్తరించి ఉంది.

వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు :

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం:-

ఈరోజు, రేపు :-

తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన గాలులు గంటకు 30 -40 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉంది.

ఎల్లుండి:-

తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 30 -40 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉంది.

దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్:-

ఈరోజు:-

తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన గాలులు గంటకు 30 -40 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉంది.

రేపు, ఎల్లుండి:-

తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 30 -40 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉంది.

రాయలసీమ:-

ఈరోజు,రేపు, ఎల్లుండి:-

తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 30 -40 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉంది.