
ఏలూరు జిల్లా జీలుగుమిల్లిలో అచ్చం సినిమా స్టైల్ లో అక్రమంగా గంజాయి తరలిస్తున్న ముఠాకు పోలీసులు చెక్ పెట్టారు. ఇద్దరు వ్యక్తుల్ని చాకచక్యంగా అరెస్టు చేసి వారి వద్ద నుంచి సుమారు 10 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. జంగారెడ్డిగూడెం అశ్వరావుపేట జాతీయ రహదారిపై జీలుగుమిల్లి వద్ద పోలీసులు వాహనాల తనిఖీలు చేస్తున్న సమయంలో ఓ బైక్ పై ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా వెళ్లడం పోలీసులు గమనించారు. దీంతో వాళ్ల బైక్‌ను అడ్డుకున్నారు. అయితే సీటు ఎత్తుగా కనిపించడంతో ఏంటా అని తనిఖీ చేశారు.
ఇంకేముంది బైక్ సీటు కింద గంజాయి ప్యాకెట్లు దర్శనమిచ్చాయి. దీంతో ఇద్దరిని వెంటనే అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా ఒరిస్సా పరిసర ప్రాంతాలలో గంజాయిని సేకరించి తెలంగాణ రాష్ట్రం కామారెడ్డికి తరలిస్తున్నట్లు తెలిసింది. నిందితుల వద్ద నుంచి సుమారు 10 కేజీల గంజాయితో పాటు, బైకు, రెండు సెల్ ఫోన్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
వీడియో చూడండి..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.