బంగాళాఖాతంలోని తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. చెన్నైకి 370 కి.మీ తూర్పు ఈశాన్యంగా, విశాఖపట్నానికి 450 కి.మీ, దక్షిణంగా.. ఒడిశా గోపాల్ పూర్‌కు 640 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. కోస్తాలో ముసురు వాతావరణం కొనసాగడంతో చలిగాలులు వీస్తున్నాయి. ఇప్పటికే కాకినాడ, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, మన్యం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. మూడ్రోజులుగా కురుస్తున్న వర్షాలు వరి, పత్తి, పొగాకు పంటలపై ప్రభావం చూపుతున్నాయి. భారీ వర్షాల దృష్ట్యా విశాఖ జిల్లాలో పాఠశాలలకు సెలవు ప్రకటించారు కలెక్టర్. కోస్తాలో తీరం వెంబడి గంటకు 40 నుంచి 50, అప్పుడప్పుడు 60 కి.మీ. వేగంతో గాలులు వీస్తున్నందున మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని విశాఖ తుఫాను హెచ్చరిక కేంద్రం హచ్చరించింది. కోస్తాలోని అన్ని ఓడరేవుల్లో మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. రానున్న 24 గంటల్లో వాయుగుండం ఉత్తర ఈశాన్యం దిశగా కదులుతూ తీవ్రతను కొనసాగిస్తుందని విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది.
వెదర్ డిపార్ట్‌మెంట్ రిపోర్ట్ ప్రకారం… డిసెంబరు 21 శనివారం రోజున శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. (Source)
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..