తెలంగాణలో పాపులర్ అయిన మిషన్ భగీరథ… ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌కి కూడా వచ్చేస్తోంది. కాకపోతే ప్రయోగాత్మకంగా ఏపీలో ఎక్కడ లేని విధంగా ఒక నియోజకవర్గంలో మాత్రమే జరుగుతుంది. నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి.. గ్రామంలోని ప్రతి ఇంటికి రక్షిత నీటిని అందించడమే ఈ వాటర్ గ్రిడ్ లక్ష్యం. దాదాపు 365 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ వాటర్ గ్రేడ్ పనులు చేపట్టారు. అయితే ఇప్పటికే 20 శాతం పనులు పూర్తయ్యాయి. మరో నెల రోజుల్లో రక్షిత నీటిని పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. ఇదే కనుక పూర్తి అయితే ఆంధ్రాలో .. ముఖ్యంగా డోన్ నియోజకవర్గంలో మిషన్ భగీరథ అమలులోకి వచ్చినట్లే. ఆ తర్వాత ఈ పథకాన్ని రాష్ట్రమంతట అమలుచేసి చేయనుంది వైసీపీ సర్కార్.
ఇక వివరాల్లోకి వెళ్తే నంద్యాల జిల్లాలోని డోన్ నియోజకవర్గం ప్రజలకు ఇంటింటికి త్రాగు నీరు అందించాలనే ఉద్దేశంతో గోరుకల్లు రిజర్వాయర్ నుంచి డోన్ నియోజకవర్గం వరకు చేపట్టిన పైప్‌లైన్ పనులు ప్రస్తుతం ముమ్మరంగా కొనసాగుతున్నాయి. రూ.320 కోట్లతో నిర్మిస్తూన్న వాటర్ ప్రాజెక్టును డోన్ నియోజకవర్గానికి చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, ప్రముఖులు,ప్రజలు ప్రత్యేకంగా వచ్చి పరిశీలించారు. ఆంధ్రప్రదేశ్‌లోనే డోన్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. అయితే అందులో భాగంగానే ఎక్కడా లేని విధంగా నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి రక్షిత నీటిని అందించే వాటర్ గ్రిడ్‌ను స్థానిక ఎమ్మెల్యే, ఆర్థిక మంత్రి అయిన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చేపట్టారు.
రిజర్వాయర్ సమీపంలో పంప్ హౌస్ వద్ద నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు పూర్తి అయితే నియోజకవర్గంలో ఏ గ్రామాలకు ఎలా తాగు నీరు అందుతుందో అనే విషయాన్ని మోగా ఇంజనీరింగ్ సంస్థ ప్రతినిధి వివరించారు. జనవరిలో లోపల ఈ ప్రాజెక్టు పనులు పూర్తి అవుతాయని తెలిపారు. అప్పటి నుంచి డోన్ నియెజకవర్గంలో ప్రతి ఇంటికి కూడా త్రాగు నీరు అందిస్తామని ఇంజనీర్లు హామీ ఇవ్వడంతో ప్రజా ప్రతినిధులు, నాయకులు,ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఏళ్ళుగా తాగు నీటితో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు శాశ్వత పరిష్కాం లభిస్తుండటంతో నిర్మాణ పనుల వద్ద నాయకులు సెల్పీలు దిగి ఎంతో ఉల్లాసంగా గడిపారు. అలాగే గతంలో ఎన్నడూ జరగని విధంగా డోన్ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి పనుల జరిగాయని, ఈ అభివృద్ధికి కారణం అయిన బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డిని అత్యధికంగా మెజారిటీతో గెలిపించుకుంటాం అంటు నాయకులు ధీమా వ్యక్తం చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..