
Kadapa District: గువ్వల చెరువు ఘాట్ రోడ్.. ఎటు చూడూ పచ్చదనం… ఎటుచూడు గుట్టలు, లోయలు… ఏమాత్రం ఏమరుపాటుగా వున్నా ఘాట్ రోడ్‌లో ఘోర ప్రమాదమే.. యాక్సిడెంట్ జరిగితే స్పష్టంగా తెలుస్తుంది. కానీ లోయలో ముగ్గురి మృత దేహాలు కన్పించిన ఘటనలో అలాంటి ఆనవాళ్లు లేవు. మృతులెవరో గుర్తించే చిన్న క్లూ కూడా లేదు. డెడ్‌బాడీస్ పూర్తిగా డీ కంపౌజయ్యాయి. అంటే వాళ్లు చనిపోయి రెండు వారాలే పైనే అయివుంటుంది.
వాళ్లెవరు? ఎలా చనిపోయారు? ఆత్మహత్య చేసుకున్నారా? లేదంటో ఎక్కడో హత్య చేసి శవాలను ఇక్కడ విసిరేశారా?
మిస్టరీగా మారిన ఈ కేసులో విచారణను చింతకొమ్మదిన్నె పోలీసులు విచారణను వేగవంతం చేశారు. క్లూస్ కోసం స్పాట్‌ను క్షుణ్ణంగా పరిశీలించారు. తలపై తీవ్ర గాయాలున్నట్టు గుర్తించారు. అంటే ఎవరైనా హత్య చేసి డెడ్‌బాడీని ఇక్కడ పడేశారా? లేదంటే ఘాట్ రోడ్ నుంచి లోయలో పడినప్పుడే గాయాలయ్యాయా? తలపై తప్ప మరెక్కడా గాయలు లేకపోవడం ఆ ముగ్గుర్ని ఎవరో హత్య చేసి .. నిజం బయటకు రాకుండా మృతదేహాలను ఇక్కడ పడేశారనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఒకవేళ అదే నిజమై వుంటే.. హంతకులు ఎవరో తెలియాలంటే ముందు చనిపోయిన ముగ్గురు ఎవరో తెల్వాలి.కానీ వాళ్లను గుర్తించే ఎలాంటి ఆనవాళ్లు లేవు. ఐతే మృతుడి షర్ట్‌పై గుడ్‌విల్ టైలర్స్, రాయచోటి అనే లేబుల్ వుంది. ఆ లేబుల్ ఆధారంగా దర్యాప్తును ముమ్మరం చేశారు పోలీసులు.
మృతులు ఎవరో గుర్తించే ఆనవాళ్లు లేవు. గుడ్ విల్ టైలర్స్ అనే లేబుల్ దర్యాప్తంగా కీలకంగా మారింది. చుట్టుపక్కల మిస్సింగ్ కేసులపై దృష్టి సారించారు పోలీసులు. గువ్వల చెరువు ఘాట్ మామూలు సమయంలోనే ప్రమాదాలను నిలయంగా ఉంటుంది .. ఇదంతా ఫారెస్ట్ ప్రదేశం .. కడప నుంచి రాయచోటి వెళ్లడానికి ఇదే ప్రధాన రహదారి .. ఇక్కడ ఏమి జరిగినా ఎవరికీ తెలియదు. అందుకే నిందితులు ఈ ప్రాంతాన్ని స్పాట్‌గా చేసుకున్నారా? ఎక్కడో హత్యలకు పాల్పడి.. నిజాన్ని సమాధి చేసేందుకు డెడ్‌బాడీస్‌ను ఓ లోయలో పడేశారా? యాక్సిడెంట్ అనే ఆనవాళ్లు లేవు.. ఆత్మహత్య అనే కోణంలో చూసినా అలాంటి ఆధారాలు లేవు. హత్యేలు కావచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మిస్టరీ ఏంటో ఇక పోలీసుల దర్యాప్తులో తేలాలి.
మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి..