Andhra Pradesh: జనసేనకు నో ఛాన్స్‌.. టీడీపీ రాజ్యసభ సభ్యుల పేర్లు ఖరారు..

డిసెంబర్‌ 3 నుంచి ప్రారంభమైన నామినేషన్లు.. డిసెంబర్‌ 10తో ముగియనుంది. నామినేషన్ల ఉపసంహరణకు గడువు డిసెంబర్ 13. డిసెంబర్‌ 20న పోలింగ్ నిర్వహించి అదే రోజు ఫలితాలను ప్రకటించనున్నారు..

Andhra Pradesh: జనసేనకు నో ఛాన్స్‌.. టీడీపీ రాజ్యసభ సభ్యుల పేర్లు ఖరారు..

Updated on: Dec 09, 2024 | 9:31 PM

ఏపీ టీడీపీ రాజ్యసభ సభ్యుల పేర్లను ఖరారు అయ్యాయి. టీడీపీ నుంచి రాజ్యసభకు బీద మస్తాన్‌రావు, సానా సతీష్‌ పేర్లను ఖరారు చేయగా, ఆర్‌ కృష్ణయ్య పేరును బీజేపీ ఇప్పటికే ఖరారు చేసింది. ఇక రాజ్యసభ ఎన్నికల్లో జనసేనకు అవకాశం దక్కపోవడంతో నాగబాబుకు ఏపీ కేబినెట్‌లో అవకాశం దక్కుతుందన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ముందుగా కూటమిలోని మూడు పార్టీలు మూడు స్థానాలను పంచుకుంటాయని వార్తలు వినిపించాయి. కానీ చివరి నిమిషంలో టీడీపీ ఇద్దరు అభ్యర్థులను ప్రకటించింది. అంతకు ముందే బీజేపీ ఒక అభ్యర్థిని ఖరారు చేసింది. టీడీపీ నుంచి బీద మస్తాన్‌రావు, సానా సతీష్‌, బీజేపీ నుంచి ఆర్‌ కృష్ణయ్యలు మంగళవారం నామినేషన్‌ను దాఖలు చేయనున్నారు.

ఇదిలా ఉంటే ఏపీ కేబీనెట్‌లో 25 మంది మంత్రులకు అవకాశం ఉంది. కానీ, ప్రస్తుతం 24 మంది మాత్రమే ఉన్నారు. ఆ ఒక్క స్థానం కూటమి ప్రభుత్వం పొత్తుల్లో భాగంగా జనసేనకు కేటాయించింది. ఈ నేపథ్యంలో మంత్రి వర్గాన్ని విస్తరించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో నాగబాబుకు మంత్రి పదవి దక్కే అవకాశాలు ఉన్నాయని విశ్వసనీయ సమాచారం. కాగా, డిసెంబర్‌ 3 నుంచి ప్రారంభమైన నామినేషన్లు.. డిసెంబర్‌ 10తో ముగియనుంది. నామినేషన్ల ఉపసంహరణకు గడువు డిసెంబర్ 13. డిసెంబర్‌ 20న పోలింగ్ నిర్వహించి అదే రోజు ఫలితాలను ప్రకటించనున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి