Andhra – Telangana: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. ముఖ్యంగా ఈ ప్రాంతాల్లో..

మే నెల 27 నాటికి పశ్చిమ మధ్య, ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరో రెండు, మూడు రోజుల్లో కేరళ రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించేందుకు అనుకూల పరిస్థితులు ఏర్పడనున్నట్లు పేర్కొంది. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇప్పుడు తెలుసుకుందాం...

Andhra - Telangana: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. ముఖ్యంగా ఈ ప్రాంతాల్లో..
Weather Report

Updated on: May 23, 2025 | 3:32 PM

రాబోయే 2 రోజుల్లో కేరళలో రుతుపవనాలు ప్రారంభానికి పరిస్థితులు అనుకూలంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు, మాల్దీవులు, కొమోరిన్ ప్రాంతంలోని మిగిలిన ప్రాంతాలు; లక్షద్వీప్ ప్రాంతంలోని కొన్ని ప్రాంతాలు, కేరళ, కర్ణాటక & తమిళనాడులోని కొన్ని ప్రాంతాలు; దక్షిణ & మధ్య ప్రాంతాలలోని మరికొన్ని ప్రాంతాలు. బంగాళాఖాతం, ఉత్తర బంగాళాఖాతం, ఈశాన్య రాష్ట్రాలలోని కొన్ని ప్రాంతాలపై నైరుతి రుతుపవనాలు మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా మారే అవకాశం ఉంది.

మే 27వ తేదీ నాటికి పశ్చిమ మధ్య మరియు దానిని ఆనుకుని ఉన్న ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది.  ఆంధ్ర ప్రదేశ్ యానంలో దిగువ ట్రోపో ఆవరణములో నైరుతి మరియు పశ్చిమ గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు ఇప్పుడు తెలుసుకుందాం…

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం :-

—————————————-

శుక్రవారం, శనివారం, ఆదివారం :- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు.. బలమైన ఈదురు గాలులు గంటకు 40 -50 కి.మీ. వేగం తో వీచే అవకాశం ఉంది.

దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ :-

—————————————-

శుక్రవారం, శనివారం, ఆదివారం :- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు… బలమైన ఈదురు గాలులు గంటకు 40 -50 కి.మీ. వేగం తో వీచే అవకాశం ఉంది.

రాయలసీమ :-

—————————————-

శుక్రవారం, శనివారం, ఆదివారం :- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు… బలమైన ఈదురు గాలులు గంటకు 40 -50 కి.మీ. వేగం తో వీచే అవకాశం ఉంది

తెలంగాణలో మరో 4 రోజులు వర్షాలు

తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో మరో నాలుగు రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు, మరికొన్ని జిల్లాల్లో ఉరుములు, ఈదురుగాలులతో వర్సాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. వచ్చే మూడు రోజులు గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది.