TDP Leader Pattabhiram: అబద్ధాలతో అధికారంలోకి వచ్చిన వైసీపీ వరుసగా పన్నులు పెంచుతూ జీవోలు ఇచ్చిందని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఆరోపించారు. రెండేళ్లలో పెట్రోల్, డీజిల్‌పై పన్నుల రూపేణ రూ.29వేల కోట్లు దండుకుందన్నారు. వైసీపీ ప్రభుత్వం బెదిరింపులకు, దాడులకు భయపడేది లేదని పట్టాభి స్పష్టం చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ నిజాలు మాట్లాడుతున్నందుకు వైసీపీ శ్రేణులు తనపై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికి మూడు సార్లు తనపై దాడులు చేశారన్నారు. ఏ నాయకుడు అవినీతికి పాల్పడినా ఎండగడుతామని ఆయన స్పష్టం చేశారు. బాధ్యత కలిగిన పసుపు సైనికుల్లా వైసీపీ ప్రభుత్వం తప్పిదాలను ఆధారాలతో సహా బయటపెడతామన్నారు.
నిజాయతీ గల నాయకుడు చంద్రబాబు సారథ్యంలో నడుస్తున్నామని, పసుపు సైనికులు వెనకడుగు వేసే ప్రసక్తే లేద పట్టాభిరామ్ అన్నారు. వైసీపీకి రాష్ట్రంలోని రోడ్ల పరిస్థితి ఇప్పుడు గుర్తొచ్చిందా? అని ఎద్దేవా చేశారు. ఆధారాలతోనే అధికార పార్టీని ప్రశ్నిస్తున్నామన్నారు. ప్రభుత్వం పన్నుల రూపంలో ప్రజలపై అనేక రకాల భారాలు మోపుతోందని, దానిలో భాగంగానే ఏడాది కాలంలో పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెంచారని పట్టాభి ఆరోపించారు. దేశవ్యాప్తంగా చూస్తూ ఆంధ్రప్రదేశ్‌లో అత్యధికమైన సభ్యులు అఢఘగి పార్లమెంటులో జూలై 6న కేంద్ర మంత్రి సమాధానం ఇచ్చారని పట్టాభి గుర్తు చేశారు.