Andhra Pradesh: చంద్రబాబు బెయిల్‌, కస్టడీ పిటిషన్‌లపై ఏసీబీ కోర్టులో నేడు విచారణ.. తీర్పుపై ఉత్కంఠ..

|

Oct 06, 2023 | 9:49 AM

స్కిల్‌ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై విజయవాడ ఏసీబీ కోర్టులో ఇవాళ కూడా వాదనలు కొనసాగనున్నాయి. ఇవాళ్టిలో వాదనలు మూడవ రోజుకు చేరాయి. బెయిల్, కస్టడీ పిటిషన్లపై గురువారం నాడు ఇరువైపు వాదనలు విన్న న్యాయస్థానం.. విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.

Andhra Pradesh: చంద్రబాబు బెయిల్‌, కస్టడీ పిటిషన్‌లపై ఏసీబీ కోర్టులో నేడు విచారణ.. తీర్పుపై ఉత్కంఠ..
Chandrababu Naidu
Follow us on

Vijayawada, October 06: స్కిల్‌ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై విజయవాడ ఏసీబీ కోర్టులో ఇవాళ కూడా వాదనలు కొనసాగనున్నాయి. ఇవాళ్టిలో వాదనలు మూడవ రోజుకు చేరాయి. బెయిల్, కస్టడీ పిటిషన్లపై గురువారం నాడు ఇరువైపు వాదనలు విన్న న్యాయస్థానం.. విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. మరోవైపు చంద్రబాబు రిమాండ్ గడువును ఈనెల 19న వరకు పొడిగించింది కోర్టు.

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై నిన్న ఏసీబీ కోర్టులో వాదనలు కొనసాగాయి. చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది ప్రమోద్‌కుమార్‌ దూబే వాదనలు వినిపించగా ఏపీ సీఐడీ తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వినిపించారు. బెయిల్, కస్టడీ పిటిషన్లకు సంబంధించి ఇరువైపు వాదనలు విన్న ఏసీబీ న్యాయస్థానం.. విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.

ఏసీబీ కోర్టులో రెండవరోజు చంద్రబాబు తరుపున న్యాయవాది దూబే వాదనలు వినిపించారు. స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో చంద్రబాబు కు సంబంధం లేదన్నారు. రెండేళ్ల తర్వాత రాజకీయ కారణాలతో కేసులో ఇరికించారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. డిజైన్ టెక్ సంస్థతో ఇతర సంస్థలు ఒప్పందం చేసుకున్నాయి. చంద్రబాబు సిఎం హోదాలో స్కిల్ డెవలప్ మెంట్ స్కీం కు నిధులు మాత్రమే మంజూరు చేశారని గుర్తు చేశారు. ఆ తరువాత ఒప్పందం ప్రకారం నలభై సెంటర్లను ఏర్పాటు చేశారు. రెండు లక్షల మందికి పైగా శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించారు. అంతా ఓపెన్ గా జరిగితే ఇందులో స్కాం ఎక్కడుంది.. చంద్రబాబు పాత్ర ఏముందంటూ వాదనలు వినిపించారు. ఇప్పటికే కస్టడీలో చంద్రబాబు విచారణ అధికారులకు సహకరించారని.. ఇక కస్టడీ అవసరం లేదన్నారు. అయినా విచారణ సాగదీయడానికే ఈ పిటిషన్ వేశారని దూబే వాదనలు వినిపించారు.

ఇవి కూడా చదవండి

ఏపీ సీఐడీ తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. చంద్రబాబు పాత్రకు సంబంధించి మరిన్ని డాక్యుమెంట్లను సీఐడీ తరపున కోర్టుకు సమర్పించారు. డొల్ల కంపెనీల పేరుతో నిధులు దారి మళ్లించారని.. హవాలా రూపంలో నిధులను కొట్టేశారన్నారు. చంద్రబాబుకు బెయిల్ ఇవ్వొద్దని.. మరింత విచారించేందుకు వీలుగా సీఐడీ కస్టడీకి అప్పగించాలని కోర్టును కోరారు. ఇరువైపు వాదనలు విన్న న్యాయస్థానం.. విచారణను ఇవాళ్టికి వాయిదా వేసింది. లంచ్ బ్రేక్ తర్వాత వాదనలు ప్రారంభంకానున్నాయి. అనంతరం తీర్పు వెలువరించనుంది ఏసీబీ కోర్ట్‌.

చంద్రబాబుతో నారా లోకేష్ ములాఖత్‌..

రాజమండ్రి సెంట్రల్‌ జైలులో చంద్రబాబుతో ములాఖత్ కానున్నారు నారా లోకేష్‌. నిన్న ఢిల్లీ నుంచి ఉండవల్లి నివాసానికి చేరుకున్న లోకేష్‌.. ఇవాళ ఉదయం 9 గంటలకు రాజమండ్రికి రోడ్డు మార్గంలో బయల్దేరనున్నారు. సాయంత్రం సెంట్రల్‌ జైలులో చంద్రబాబుతో ములాఖత్ కానున్నారు. అయితే లోకేష్‌ వెంట ఎవరెవరు వెళ్తారనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..